Pakistan: “9/11 దాడుల్ని” గుర్తుకు తెచ్చిన పాక్ ఎయిర్‌లైన్ పోస్ట్.. విచారణకు ఆదేశించిన పీఎం షెహబాజ్..
- 9/11 ఉగ్రదాడుల్ని తలపించేలా పాక్ ఎయిర్ లైన్ యాడ్..
- నవ్వుల పాలైన పాకిస్తాన్..
- దీనిపై దర్యాప్తుకు పాక్ పీఎం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన 9/11 ఉగ్రదాడిని తలపించేలా, ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) చేసిన సోషల్ మీడియా పోస్ట్ నవ్వులపాలైంది. పాకిస్తాన్ పరువు తీసింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని విమానాలు ఢీకొన్న తరహాలోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని ఢీకొనేందుకు వెళ్తున్నట్లుగా పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్‌ని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌ని ఏకిపారేశారు.
జనవరి 10న పీఐఏ తన ఎక్స్‌లో.. ఫ్రాన్స్ జెండా బ్యాక్‌గ్రౌండ్‌గా ఈఫిల్ టవర్ వైపు వెళ్తున్న పీఐఏ విమానం ఉన్న ఫోటోని షేర్ చేసి..‘‘పారిస్ మేము ఈ రోజు వస్తున్నాం’’ అంటూ కామెంట్స్ రాసింది. ఇది 9/11 దాడుల్ని గుర్తుకు తెచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కొన్ని రోజుల్లోనే 21 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
Also Read
- Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ 'షాక్' అస్త్రం!
- Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
Read Also: Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..
అయితే, ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ప్రకటనను ఎవరు రూపొందించారో దర్యాప్తు చేయాలని ప్రధాని అధికారుల్ని ఆదేశించినట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అన్నారు. నాలుగేళ్ల నిషేధం అనంతరం, పీఐఏ విమానం జనవరి 10న పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్‌ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.
— PIA (@Official_PIA) January 10, 2025
తాజావార్తలు
-
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?