రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
- భారత మార్కెట్లో iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్
- 6.74-అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ HBM బ్రైట్నెస్
- MediaTek Dimensity 6300 (6nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్, Mali-G57 MC2 GPUతో
- 50MP Sony IMX852/LYT505C ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
- 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IP65 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్
- రూ.19,499 నుంచి ధరలు మొదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z11 Lite 5G Launched: ఐక్యూ (iQOO) భారత మార్కెట్లో iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. బడ్జెట్ 5G సెగ్మెంట్‌ను లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ వంటి ఫీచర్లను అందించింది. వీటితోపాటు AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
డిస్ప్లే & చిప్సెట్:
iQOO Z11 లైట్ లో 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ HBM బ్రైట్నెస్ తో వస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌కు MediaTek Dimensity 6300 (6nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను అందించారు. 4GB, 6GB LPDDR4X ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అవసరమైతే మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. 6GB RAM వేరియంట్‌కు 2 సంవత్సరాల OS అప్డేట్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read
- Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
AI ఫీచర్స్:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో Non-Stop Intelligence పేరుతో అనేక AI ఫీచర్లను అందించింది. AI క్రియేషన్ ద్వారా కంటెంట్ రాయడం, టెక్స్ట్ సమరీలు రూపొందించడం వంటి పనులు చేయవచ్చు. AI క్యాప్షన్స్ సహాయంతో ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేసి వెంటనే టెక్స్ట్ రూపంలో సారాంశాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ AI ఫీచర్లు రోజువారీ పనులను మరింత సులభతరం చేస్తాయని కంపెనీ చెబుతోంది.
50MP సోనీ కెమెరా & బ్యాటరీ:
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో 50MP సోనీ IMX852/LYT505C ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి 0.08MP సెకండరీ సెన్సార్ తోడుగా ఉంటుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఇందులో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం 37 నిమిషాల్లో బ్యాటరీ 50% వరకు ఛార్జ్ అవుతుంది.

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ:
ఈ స్మార్ట్‌ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ లభించింది. అలాగే IP65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉండటంతో నీటి చినుకులు, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.4, 5G, USB టైపు-C పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు:
* 4GB + 128GB – రూ. 19,499.
* 6GB + 128GB – రూ. 21,499.
* 6GB + 256GB – రూ. 24,499.
iQOO Z11 Lite మిడ్నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. లాంచ్ సందర్భంగా ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డులతో రూ. 1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 3 నెలల వరకు No Cost EMI సదుపాయం కూడా ఉంది. జూలై 30 నుంచి అమెజాన్ ఇండియా, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్స్ లో.. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది.

తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!