ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ఇప్పటి వరకు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 5న చెన్నైలోని పెరంబూర్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్‌ని ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ కేసులో తాజాగా మరో నిందితుడని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Helicopter crash: విమాన ప్రమాదాలకు నేపాల్ కేరాఫ్‌గా మారింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం ఆ దేశంలోని నువాకోట్‌లోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. హెలికాప్టర్ రాజధాని ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టింది.
Waqf Board: వక్ఫ్ బోర్డు ‘‘అపరిమిత అధికారాలకు’’ బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్తగా చట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్యను కొందరు ముస్లింలు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు బిల్లులను తీసుకురావడం ద్వారా చట్టానికి 40కి పైగా సవరణలు ప్రవేశపెట్టబడనున్నట్లు తెలుస్తోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ తీవ్ర హింస, ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నిన్న బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమె ప్రస్తుతం భారత అధికారుల రక్షణలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
Maharashtra: మహరాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను నమోదు చేసిన కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘మహా వికాస్ అఘాడీ‘ కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటోంది.
Muhammad Yunus: నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.
Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులా క్రీడాకారులకు, ఇతరులకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి. భారత్ అనుకూల నేత షేక్ హసీనాను దేశం వదిలిపారిపోయేలా అక్కడ హింస చెలరేగింది. ప్రస్తుతం ఆమె భారత్ రక్షణలో ఉన్నారు. త్వరలోనే యూకేలో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Sheikh Hasina: ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని దించేందుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు కొన్ని నెలలకే నిజమయ్యాయి. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని వదిలి పారిపోయేలా చేశారు.
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్‌లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.