ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడిలో లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ని హతమార్చింది. అయితే, ఇజ్రాయిల్ లెబానాన్ నుంచి వస్తున్న శత్రువుల డ్రోన్లు అడ్డగించింది.
ఇదిలా ఉంటే షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఈరోజు ఆ దేశ పార్లమెంట్‌ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రెస్ సెక్రటరీ షిఫ్లూ జమాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
ఇదిలా ఉంటే భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపే శక్తి భారత్‌కి ఉందని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తాను భారత్ ఒక ముఖ్యమైన దేశమని, బిగ్ పవర్ అని, అంతర్జాతీయ సమాజంలో ప్రభావవంతమైన దేశం అని తాను పదేపదే ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు వస్తున్నట్లు ఆమె అభ్యర్థించారని ఈ రోజు రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు
దేవాలయాలకు నిప్పు పెట్టడంతో పాటు, హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో కొందరు ముస్లిం మతపెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
UK Violence: బ్రిటన్ హింసతో అట్టుడుకుతోంది. యూకే వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు బ్రిటన్ జాతీయులైన పిల్లలపై కత్తిపోట్ల దాడి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.
Sheikh Hasina: అనూహ్య పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధానికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఇండియాకు చేరారు.
తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘‘మా దౌత్య కార్యకలాపాల ద్వారా మేము బంగ్లాదేశ్‌లోని భారతీయ సమాజంతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. అక్కడ 19,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా
Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు.
Bangladesh clashes: బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. మరోసారి నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆదివారం రాజధాని ఢాకాలో నిరసనకారులు చేపట్టిన కార్యక్రమాలు హింసకు కారణమయ్యాయి. నిరసనకారులు పోలీసులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో 93 మందికి పైగా మరణించారు.