Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, బీజేపీ మధ్య విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఫిబ్రవరి 5న ఢిల్లోలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదని కేజ్రీవాల్ ఆరోపించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండు కాలనీ ఓట్ల కోసం ‘‘బంగారు గొలుసు’’లు పంచుతోందని, ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లు తమ ఓట్లను అమ్ముకోవద్దని ఓటర్లను కోరారు. బీజేపీ నేతలు నగదు, ఇతర వస్తువుల్ని పంపిణీ చేయడం ద్వారా ఢిల్లీ ఓట్లను కొనుగోలు చేయాలని ప్లాన్‌ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ‘‘వారు బంగారు గొలుసులు పంపిణీ చేయడం ప్రారంభించాని మాకు తెలిసింది. వారు రెండు కాలనీల్లో ఓట్లను కొంటున్నారు. ప్రజల డబ్బు, చీరలు, బ్లాంకెట్స్, ఇతర వస్తువులు ఎక్కడికి వెళ్లాయో బీజేపీ నేతలు వివరించాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు.
Read Also: Udyogini Scheme: మహిళలకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తున్న కేంద్రం.. 50 శాతం సబ్సిడీ కూడా!
ఓట్లకు డబ్బులు పంచుతున్నట్లు తెలిస్తే ఏ ఆప్ అభ్యర్థికి ఓటు వేయవద్దని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. మేము ఎన్నికల్లో గెలవడానికి, ఓడిపోవడానికి ఇక్కడికి రాలేదు, దేశాన్ని మార్చడానికి మేము ఉన్నామని అన్నారు. ప్రజలు బీజేపీ పంపిణీ చేస్తున్న ప్రతీదానిని తీసుకోవాలని, కానీ ఓట్లు అమ్ముకోవద్దు అని కోరారు. డబ్బులు పంపిణీ చేసే ఎవరికీ ఓటేయద్దని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేజ్రీవాల్‌పై బీజేపీ విరుచుకుపడుతోంది. ఏ రాజకీయ కూటమిలో చేరబోనని కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఉల్లంఘించారుని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఆప్ నాయకుల అవినీతి ముఖాన్ని ఓటర్లు గుర్తించారని అన్నారు. కేజ్రీవాల్‌కి ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు వీడ్కోలు పలుకుతారని చెప్పారు. కాంగ్రెస్‌తో ఆప్ చేతులు కలిపిందని, కేజ్రీవాల్ ఆయన హామీలను మరిచిపోయిందని ఆయన అన్నారు. బీజేపీ ఢిల్లీలో మురికివాడల వాసులకు కాంక్రీట్ ఇల్లు ఇస్తామని, మురికివాడలకు మంచి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 అరవింద్ కేజ్రీవాల్‌కి వీడ్కోలు పలికే రోజని అన్నారు.