Meta: ఐటీ ఉద్యోగులకు మెడపై కత్తి వేలాడుతోంది. గత రెండేళ్లుగా అగ్రశ్రేణి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘‘లే ఆఫ్’’ ఇస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాబోయే కాలంలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా, బ్లూమ్‌బెర్గ్ మంగళవారం నివేదించిన అంతర్గత మెమో ప్రకారం.. మెటా తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకోవాలని చూస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం మందిని ప్రభావితం చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Team India: బీజీటీలో అతను ఆడకపోయి ఉంటే మేము గెలిచే వాళ్లం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
సెప్టెంబర్ నాటికి మెటాలో దాదాపుగా 72,400 మంది ఉద్యోగులు ఉన్నారు. పనితీరు నిర్వహణ స్థాయిని పెంచాలని, తక్కువ పనితీరు కనబరిచే వారిని వేగంగా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ప్రతిభ కలిగిన కొత్త వ్యక్తుల్ని తీసుకురావడానికి పనితీరు ఆధారిత ఉద్యోగుల తొలగింపు ఉంటుందని మెటా చెప్పింది. మెటాకి ముందు మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి కోతల్ని ప్రకటించింది. ఇది మొత్తం కంపెనీలోని 1 శాతం ఉద్యోగులపై ప్రభావం చూపిస్తోంది.
జనవరి 20న ట్రంప్ వైట్‌హౌజ్‌లోకి వస్తున్న నేపథ్యంలో, ఆలోపే మెటా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుండటం గమనార్హం. గత వారం, జుకర్‌బర్గ్ తన ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన కంపెనీ US ఫాక్ట్ చెక్ కార్యక్రమాన్ని ముగించినట్లు ప్రకటించారు. కంపెనీ తన వైవిధ్య కార్యక్రమాలను తగ్గించుకుంది, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో కంటెంట్ నియంత్రణ నియమాలను సడలించింది,