Venu Goapl Reddy
Author- NTV Telugu-
Annamalai: అప్పుడు “నోటా” పార్టీ అంటూ ఎగతాళి, ఇప్పుడు పొత్తుల కోసం ఆరాటం..
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. -
Madhya Pradesh: భార్యని చంపి వ్యక్తి ఆత్మహత్య, మనవడి చితిలో దూకిన తాత..
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదకర సంఘటన జరిగింది. మనవడి చితిలోకి దూకి తాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని సిధి జిల్లాలోని బహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రాయమంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అభయ్ రాజ్ యాదవ్(34) అనే వ్యక్తి తన భార్య సవితా యాదవ్(30)ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారి అంత్యక్రియల సమయంలో అభయ్ తాత కూడా అతడి చితిలోకి దూకి మరణించాడు. Read Also: Samyuktha Menon : మహిళా […] -
PM Modi: మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు దేశాలు కూడా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం, వాణిజ్యం పెంపు, వివిధ రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. Read Also: YS Viveka Murder Case: రంగన్న […] -
Madhya Pradesh: మత మార్పిడులు చేసే వారిని ఉరితీస్తాం.. ఎంపీ సీఎం వార్నింగ్..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోమవారం మత మార్పిడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడుల కేసుల్లో మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ దీనిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కలిగి ఉందని అన్నారు. మైనర్లపై అత్యాచారానికి శిక్ష విధించినట్లే, బాలికల్ని మతం మార్చిన వారికి కూడా మరణశిక్ష విధించే నిబంధనల్ని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. Read Also: Pakistan: కుల్భూషన్ జాదవ్ కిడ్నాప్‌కి సాయం చేసిన ఉగ్రవాది హతం.. […] -
Pakistan: కుల్భూషన్ జాదవ్ కిడ్నాప్‌కి సాయం చేసిన ఉగ్రవాది హతం.. పాక్‌లో ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’
Pakistan: పాకిస్తాన్లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తమ సత్తా చూపించారు. భారత వ్యతిరేక, పాక్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్నారు. అత్యంత పకడ్భందీగా ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటి వరకు పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఆర్మీ వీరిని పట్టుకోలేకపోతోంది. అయితే, దీని వెనక భారత హస్తముందని పాక్ ఆరోపిస్తోంది. -
Rahul Gandhi: “రాహుల్ గాంధీనే మాకు పెద్ద ఆస్తి”.. గుజరాత్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
Rahul Gandhi: రాహుల్ గాంధీ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్లో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తే 40 మంది వరకు నాయకులను తొలగించేందుకు కాంగ్రెస్ సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి కొందరు కాంగ్రెస్ నేతలు రహస్యం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. గుజరాత్ ప్రజలతో మనం కనెక్ట్ కావాలంటే ప్రజలతో ఉండే నాయకులను, ప్రజలకు దూరంగా ఉండే నాయకులను గుర్తించాలని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్… -
Indian Railways: ఇకపై కన్ఫామైన టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి అనుమతి.. రైల్వే కీలక నిర్ణయం.
Indian Railways: రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించనున్నారు. దేశంలో అతిపెద్దవైన 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ముఖ్యమైన స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. Read Also: Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది […] -
Hampi gangrape case: ఇజ్రాయిల్ మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితుల అరెస్ట్..
Hampi gangrape case: కర్ణాటక హంపి గ్యాంగ్‌రేప్ కేసు సంచలనంగా మారింది. హంపీకి సమీపంలో 27 ఏళ్ల ఇజ్రాయిల్ పర్యాటకురాలితో పాటు హోమ్ స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను గంగావతికి చెందిన సాయి మల్లు, చేతన్ సాయిగా గుర్తించారు. -
Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..
Hizbul Mujahideen: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న కరడుకట్టిన హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ హుస్సేన్ మాలిక్‌ని మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. యూపీలో పెద్ద ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు తేలింది. -
Women’s Day: “మహిళలు ఒక హత్య చేస్తే శిక్షించవద్దు”.. రాష్ట్రపతికి సంచలన లేఖ..
Women's Day: మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ -శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు. మహిళలు అణచివేత మనస్తత్వం, అత్యాచార మనస్తత్వం, నిష్క్రియాత్మక శాంతిభద్రత ధోరణిని చంపాలనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారాన్ని లేఖలో ఖడ్సే పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!