BJP On Rahul Gandhi: కాంగ్రెస్ నీచ వైఖరి బయటపడింది.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ నీచ వైఖరి బయటపడిందని జేపీ నడ్డా ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP On Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో మాత్రమే కాకుండా దేశంతో కూడా పోరాడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నీచమైన నిజం ఇప్పుడు బయటపడింది’’ అని అన్నారు. ప్రతిపక్షం దేశంతో పోరాడుతోందని అని భావిస్తే రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ ఎందుకు వెంట తీసుకెళ్లారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
ఢిల్లీలోని కొత్త కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేశారు. ‘‘ఆర్ఎస్ఎస్ భావజాలం వంటి మా సిద్ధాంతం వేల ఏళ్ల పూరాతనమైంది. వేల ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ భావజాతంలో పోరాడుతోంది. మేము న్యాయమైన పోరాటం చేస్తున్నామని అనుకోకండి, ఇందులో న్యాయం లేదు. మనం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్‌తో పోరాడుతున్నామని మీరు నమ్మితే, ఏమి జరుగుతుందనేది మీకు అర్థం కాలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని సంస్థల్ని స్వాధీనం చేసుకున్నాయి. మనం ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తోనే కాకుండా భారతదేశంతో కూడా పోరాడుతున్నాము’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Read Also: Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
బీజేపీ చీఫ్ నడ్డా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నీచమైన నిజం బయటపడింది, దేశానికి తెలిసిన విషయాన్నే ఆయన స్పష్టం చేసినందుకు అభినందిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతదేశాన్ని కించపరిచేందుకు రాహుల్ గాంధీ ఆయన ఎకోసిస్టమ్, అర్బన్ నక్సల్స్, డీప్ స్టేట్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనేది రహస్యం కాదని, ఆయన పదేపదే ఈ విషయాన్ని బలపరుస్తున్నారని, రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు, సమాజాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్నారని నడ్డా ఆరోపించారు. బలహీనమైన భారతదేశాన్ని కోరుకునే శక్తులను ప్రోత్సహించడం కాంగ్రెస్ నైజమని చెప్పారు.
అంతకుముందు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ… అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట తర్వాత దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆయనపై దేశద్రోహం పెట్టి, అరెస్ట్ చేసిన విచారిస్తానని అన్నారు. మరే దేశములో అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేస్తారని చెప్పారు.
Hidden no more, Congress’ ugly truth now stands exposed by their own leader.
I 'compliment' Mr. Rahul Gandhi for saying clearly what the nation knows- that he is fighting the Indian state!
It is not a secret that Mr. Gandhi and his ecosystem have close links with Urban Naxals…
— Jagat Prakash Nadda (@JPNadda) January 15, 2025
The LoP, who was sworn in by taking oath on the Constitution, is now saying, “We are now fighting the BJP, the RSS and the Indian State itself.”
So, @INCIndia and @RahulGandhi, what for are you carrying a copy of the constitution in your hand? https://t.co/pi3hNpoDWZ
— Nirmala Sitharaman (@nsitharaman) January 15, 2025
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!