Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఇంటాబయట వివాదాస్పదమవుతున్నాయి. సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. మరోవైపు రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా అమెరికా చట్టసభ సభ్యురాలు, భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలిగా పేరున్న ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
IC 814 Hijack: ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ నెట్‌ఫ్లి్క్స్ సిరీస్ మూలంగా మారోసారి 1999లో జరిగిన ఖాట్మాండు-ఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ విషయాన్ని గుర్తు చేసుకున్నాము. ఇప్పుడున్న జనరేషన్ వారికి పెద్దగా దీని గురించి తెలియదు. 8 రోజుల పాటు దేశాన్ని కలవరపరిచిన ఈ హైజాక్ ఉదంతంలో ఆనాటి సంఘటనల్ని అప్పటి అధికారులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
Amit Shah: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ దేశంలోని రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ..‘‘దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తుల’’తో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడని బీజేపీ మండిపడుతోంది. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండీ, భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో భేటీ అయ్యారు.
UP News: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికను బందీగా చేసుకుని ఓ మదర్సా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Heart Diseases: ఇటీవల కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు అనేది ఎక్కువగా వయసు పైబడిన వారికి వచ్చే ఆరోగ్య సమస్యగా భావించేవారు. అయితే, ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ గుండె వైఫల్యాల వల్ల మరణిస్తున్నారు. అయితే, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనే రెండు భిన్నమైన కండిషన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు గుండెకు సంబంధించిన విషయాలే అయినప్పటికీ, వీటి మధ్య వ్యత్యాసం ఉంటుంది.
Tata: పండగ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా. తన ఈవీ కార్లను పెద్ద ఎత్తు విక్రయించేందుకు ప్లాన్ చేసింది. నెక్సాన్ EV, పంచ్ EV మరియు టియాగో EV ధరలను రూ. 3 లక్షల వరకు తగ్గించింది.
Bangladesh: ఉగ్రవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ నేతలుగా పేరొందిన వారిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం వారందరిని అరెస్ట్ చేసింది. వారి సంస్థలపై నిషేధం విధించింది. అయితే, హసీనా గద్దె దిగడంతో ప్రస్తుతం ఆ దేశం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉంటే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాద నేతలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానురాను ఆ దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదం పెరుగుతోంది.
Huawei unveils Mate XT: మొబైల్ మార్కెట్లో ఇప్పటికే ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చాయి. ఇప్ప్పుడు అంతకుమించి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే తొలిసారిగా ‘‘ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్’’ని తీసుకువచ్చింది.
iPhone 16: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిన్న రిలీజ్ చేసింది. నాలుగు మోడళ్లను ఐఫోన్ 16లో తీసుకువచ్చారు. ‘‘ఇట్స్ గ్లోటైమ్’’ ఈవెంట్లో ఐఫోన్ 16తో పాటు ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని విడుదల చేసింది. ఇదిలా ఉంటే చైనా వెలుపల అసెంబుల్ చేయబడిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఐఫోన్ 16 తయారైంది. భారతదేశ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన ఐఫోన్ 16 ప్రపంచ దేశాలకు ఎగుమతి కాబోతోంది.