Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్‌తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
BJP: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గణపతి పూజ సందర్భంగా మోడీ, చంద్రచూడ్ ఇంటికి వెళ్లారు. గణపతి పూజలో సీజేఐ దంపతులతో కలిసి ఉన్న ఫోటోని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ వంటి ఇండియా కూటమి నేతలు ప్రధాని వెళ్లడాన్ని తప్పుపడుతున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చేలా చేశాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేసి దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. హిందూ వ్యాపారాలను, ఆలయాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ దేశంలో హిందువుల పరిస్థితి చక్కబడుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే, ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ, ఇతను వెళ్లిన ప్రతీచోట ప్రభుత్వాలు దిగిపోవడం, తిరుగుబాటు రావడం జరిగింది.
ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేని స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. మహిళ ఎముకలు, దంతాలు విరిగిపోయి ఉన్నాయని యూపీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. గుజైనిలోని హైవేపై మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. బుధవారం ఈ విషయాన్ని గమనించి స్థానిక పోలీసులు సమాచారం అందించారు.
Frog leg in samosa: వందల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించం లేదు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల షాపులు కాసులు వేటలో పడి నాణ్యతను మరిచిపోయి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయి.
Teeth Implants: దంతాల సర్జరీ ఒకరి ప్రాణాలను తీసింది. ఒకే రోజు ప్రమాదకరమైన రీతిలో ఈ సర్జరీ సాగడంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు చైనాలోని జరిగింది. హువాంగ్ అనే ఇంటిపేరు కలిగిన వ్యక్తి ఆగస్టు 14న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జిన్హువాలోని యోంగ్ కాంగ్ దేవే డెంటల్ ఆస్పత్రిలో దంతాలకు సంబంధించిన ఒక ప్రొసీజర్ చేయించుకున్నాడు.
BJP VS INDIA: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. గణేష్ పూజ కోసం వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. విపక్ష నేతలు దీనిని తప్పుపడుతున్నారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లుతుందని చెబుతున్నారు. అయితే, గణపతి పూజకు వెళ్లడం నేరం కాదని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అనేక వేదికలను కలిసి పంచుకున్నారని అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది.
Rahul Gandhi: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, వారి ఇద్దరు మహిళా స్నేహితులపై జరిగిన దాడి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, వారి గర్ల్ ఫ్రెండ్స్‌లో ఒకరిపై సామూహిక అత్యాచారం జరిగింది.