Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jagjit Singh Dallewal: నిరాహార దీక్ష విరమించిన రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లెవాల్..
Jagjit Singh Dallewal: సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతులు లేవనెత్తిన ఇతర అంశాలను డిమాండ్ చేస్తూ ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని ప్రకటించారు. -
PM Modi: ‘‘భాషాభిమానం ఉంటే తమిళంలో సంతకం చేయండి’’.. స్టాలిన్‌పై ప్రధాని మోడీ ఫైర్..
PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు. -
Gujarat: ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడంపై మందలించిన తల్లి.. 16 ఏళ్ల బాలిక సూసైడ్..
Gujarat: తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. 11వ తరగతి చదువుతున్న బాలిక తల్లి మందలించిన రెండు రోజుల తర్వాత ఈ ఘటనకు పాల్పడింది. బాలిక, తన తమ్ముడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంది. తన కుమార్తె క్రమం తప్పకుండా తన ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడాన్ని తల్లి అభ్యంతరం చెప్పింది. ఆమె తన సొంత వాహనాన్ని ఉపయోగించకుండా, తన కుమార్తెపై ఎందుకు ఆధారపడుతుందని తల్లి ప్రశ్నించింది. -
Badminton coach: 16 ఏళ్ల బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం.. మొబైల్లో బాలికల నగ్న చిత్రాలు..
Badminton coach: బెంగళూర్‌కి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్లో 7-8 మంది బాలిక అభ్యంతరకమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు హులిమావులోని బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత రెండు ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది. -
Waqf Act: “వక్ఫ్ చట్టాన్ని” వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్త నిరసన.. ముస్లిం సంస్థ హెచ్చరిక..
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహిస్తామని ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) తెలిపింది. అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. పార్లమెంట్లో బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్జేపీలను విమర్శిస్తూ.. ఆ పార్టీల లౌకిక ముసుగు తొలగిపోయిందని పేర్కొంది. -
MK Stalin: ప్రధాని మోడీ కార్యక్రమానికి స్టాలిన్ గైర్హాజరు.. కారణం ఇదే..
MK Stalin: తమిళనాడు రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అయితే, డీలిమిటేషన్ గురించి తమిళ ప్రజల భయాలను తొలగించడానికి ప్రధాని మోడీ నుంచి హామీ కావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సీట్ల వాటా శాతం మారకుండా కసరత్తు చేయాలని కోరారు. -
Bengaluru: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త..
Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఒక వీధిలో నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 43 ఏళ్ల కృష్ణప్పగా గుర్తించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. -
Nirmala Sitharaman: 2034 తర్వాతే “జమిలి ఎన్నికలు”.. నిర్మలా సీతారామన్ క్లారిటీ..
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు. -
UP: “మీరట్ మర్డర్” వీడియోలు పంపుతూ భార్యకు బెదిరింపులు..
UP: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని అతడి భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పేశారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్ తన కుమార్తె బర్త్ డేకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. Read Also: […] -
IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..
IndiGo: త్రివేండ్రం నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో 5 ఏళ్ల చిన్నారి బంగారు గొలుసు కనిపించకుండా పోయింది. అయితే, ఇండిగో విమాన సిబ్బంది దొంగలించిందని ఆమె తల్లి ఆరోపించింది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ దొంగిలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 1న విమానం గాలిలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!