IC 814 hijack: ‘IC 814: ది కాందహార్ హైజాక్’’ నెట్‌ఫ్లిక్స్ సిరీజ్ 1999లో జరిగిన ఆనాటి ఇండియన్ ఎయిర్‌లైన్ హైజాకింగ్ ఉదంతాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సిరీజ్పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ, ఇది ఆనాటి రాజకీయ పరిస్థితులను వివరించింది. ఇప్పటి తరానికి ఆనాటి సంఘటనను గురించి చెప్పింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బుధవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఇద్దరు యువ ఆర్మీ అధికారు విహారయాత్రకు వెళ్లారు. అయితే, నేరస్తులు ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, అందులో ఒక మహిళపై అత్యాచారం చేశారు. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్ఫాంట్రీ స్కూల్లో యంగ్ ఆఫీసర్స్(వైఓ) కోర్సు చదువుతున్న 23, 24 ఏళ్ల అధికారులు తమ గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్ కోసం వెళ్లినప్పుడు ఘటన జరిగినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు.
Hyundai Creta EV: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే టాటా తన అన్ని కార్లను డిజిల్/పెట్రోల్‌లో సహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవెయింట్ ఈవీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా హ్యుందాయ్ క్రెటా EV అని చెప్పవచ్చు. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్‌లో క్రెట్ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఇక ఈవీలో కూడా తన సత్తా చాటుతుందని కంపెనీ భావిస్తోంది.
Nissan Magnite facelift: నిస్సాన్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్‌ని కొత్త అవతార్‌లో తీసుకురాబోంది. నిన్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం ఇండియా మార్కెట్లో మంచి సేలింగ్స్ని నమోదు చేస్తోంది. ఇప్పటికీ ఈ కార్ విడుదలై నాలుగేళ్లు గడిచింది. ఇదిలా ఉంటే తాజాగా నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్ కాబోతోంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ గత పదేళ్ల కాలంగా ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీకి, 2024లో ప్రతిపక్ష హోదా తీసుకువచ్చాడనే ఖ్యాతి కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఆయన లోక్‌సభలోప్రతిపక్ష నాయకుడిగా (LoP)ఉన్నారు. అయితే, ఆయన ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. నిజానికి భారత అంతర్గత విషయాలను ఎలాంటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ విదేశీ గడ్డపై మాట్లాడటం అంత సబబు కాదు. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన భేటీ అవుతున్న వ్యక్తులపై తీవ్ర…
Sanjauli Mosque Row: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం ముదురుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని చెబుతూ, స్థానిక ప్రజలు, హిందూ గ్రూపు, బీజేపీ తీవ్ర నిరసనలు చేస్తోంది. అయితే, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తోంది. ఈ వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
Gambling: జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా పందెంకాశాడు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు. భార్యపై స్నేహితులు లైంగిక వేధింపులకు అనుమతినిచ్చాడు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపుని రద్దు చేయబోగోంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది.
ఇదిలా ఉంటే, బెంగాలీలు అత్యంత పవిత్రంగా భావించే దుర్గాపూజ సమయంలోనే భారత్‌కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పశ్చిమ బెంగాల్‌కి ఎగుమతి అయ్యే ‘‘పద్మ హిల్సా’’ చేపలపై నిషేధం విధించింది. ప్రతీ ఏడాది దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలతో విందు చేసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్లో సంప్రదాయంగా భావిస్తుంటారు.