Bengaluru: బెంగళూర్‌లో మరో శ్రద్ధావాకర్.. ఫ్రిజ్‌లో 32 ముక్కలుగా మహిళ శరీర భాగాలు..
- బెంగళూర్‌లో దారుణంగా మహిళ హత్య..
- 32 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో శరీర భాగాలు..
- శ్రద్ధా వాకర్ తరహాలో హత్య..
- నగరంలో సంచలనంగా మారిన మహాలక్ష్మీ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru:బెంగళూర్‌లో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి, ఆమె నివాసంలోని ఫ్రిజ్‌లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనుమానితులు ఎవరు..? అనే వివరాలు తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో నిందితుడి గురించి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మృతురాలిని బెంగళూర్ సమీపంలోని నేలమంగళకు చెందిన మహాలక్ష్మీగా గుర్తించారు. ఆమె భర్తని హేమంత్ దాస్‌గా పోలీసులు గుర్తించారు.
Read Also: Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఈ ఘటన బెంగళూర్‌లోని వయాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 15 రోజుల క్రితమే యువతి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యని తలపిస్తోంది. మల్లేశ్వరం పరిధిలోని వైయాలికావల్ మున్నేశ్వర్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు డాగ్ స్వ్కాడ్, ఫింగర్ ఫ్రింట్స్ నిపుణులను సంఘటన స్థలానికి రప్పించారు. అదనపు కమిషనర్ కేసును దగ్గరుండి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే బాధితురాలు ఈ ఇంటికి మారినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం బాధిత మహిళ తల్లి, చెల్లి ఆమెని చూసేందుకు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య బెంగళూర్‌లో సంచలనంగా మారింది. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉదయం 9.30 గంటలకు జాబ్‌కి వెళ్తే, రాత్రి 10.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేదని స్థానికులు తెలిపారు. బాధితురాలి తల్లి, సోదరి ఇంటికి వచ్చిన క్రమంలో దుర్వాసన రావడంతో ఫ్రిడ్జ్ తెరిచి చూడగా ఈ ఘటన గురించి తెలిసింది.
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి