Rahul Gandhi: ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ.. బీజేపీపై ఆరోపణలు..
- ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ..
- తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ట్వీట్..?
- కావాలనే బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే, అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తొలిసారిగా రాహుల్ గాంధీ మౌనం వీడారు. బీజేపీ అబద్ధాలను చెబుతోందని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉందా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘నేను భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడుని, సోదరీమణులను అడగాలనుకుంటున్నాను. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందా..? భారతదేశంలో ప్రతీ సిక్కు లేదా ప్రతీ భారతీయుడు తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశంగా ఉందా..? ’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్‌తో రక్షణ..
అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘‘ఎప్పటి లాగే బీజేపీ అసత్య ప్రచారాన్ని ఆశ్రయించింది. వారు సత్యాన్ని సహించలేదక నన్ను మౌనంగా ఉంచాలని తహతహలాడుతున్నారు. కానీ భారతదేశాన్ని నిర్వచించే విలువలైన భిన్నత్వంలో ఏకత్వం కోసం ఎల్లప్పుడూ మాట్లాడుతాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 10న, వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించడానికి, కారా ధరించి గురుద్వారాలకు వెళ్లేందుకు అనుమతించబడుతారా..? దీనిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. ఇది ఒక సిక్కులకు సంబంధించిందే కాదు, అన్ని మతాలకు సంబంధించింది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత అంటే ద్వేషించే అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హన్ ఓమర్‌తో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని కూడా బీజేపీ తీవ్రంగా విమర్శించింది.
The BJP has been spreading lies about my remarks in America.
I want to ask every Sikh brother and sister in India and abroad – is there anything wrong in what I have said? Shouldn't India be a country where every Sikh – and every Indian – can freely practice their religion… pic.twitter.com/sxNdMavR1X
— Rahul Gandhi (@RahulGandhi) September 21, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!