Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్‌తో రక్షణ..
- దేశవ్యాప్తంగా సంచలనంగా తిరుపతి లడ్డూల వివాదం..
- మళ్లీ తిరుపతి లడ్డూల కోసం ‘‘నందిని నెయ్యి’’..
- నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్.. ఎలక్ట్రిక్ లాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati laddoos: తిరుపతి లడ్డూల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు జంతువుల కొవ్వు కలిగి ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూల కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కి చెందిన ‘‘నందిని’’ నెయ్యిని తిరిగి సరఫరా చేయడం ప్రారంభించింది. తిరుపతి దేవస్థానానికి వచ్చే నెయ్యి కోసం భద్రతా చర్యల్ని పెంచింది.
తిరుపతి దేవస్థానానికి వెళ్లే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, నెయ్యి కల్తీకి ఎలాంటి తావు లేకుండా చూస్తామని కర్ణాటక మిల్క్ ఫెడరేష్ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ లాకుల్ని కేవలం ఆలయ బోర్డు అధికారులు మాత్రమే తెరవగలరు. లడ్డూల నాణ్యతను మెరుగుపరచడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని నెయ్యిని తిరిగి పొందడం ప్రారంభించింది.
Also Read
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
Read Also: Noida: వెరీ లక్కీ.. కారు బైక్‌ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్‌పై వచ్చి పడ్డ యువతి (వీడియో)
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నందిని 2013 నుంచి తిరుపతి దేవస్థానానికి 4,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేసింది. తిరుపతి లడ్డూల వివాదం వెలుగులోకి రావడంతో మరోసారి ఈ సంస్థ నుంచే నెయ్యిని తిరిగి పొందుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా దేవాలయాలకు కూడా ప్రసాదం కోసం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశించింది.
“తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, అన్ని కర్ణాటక దేవాలయాలు నందిని నెయ్యిని ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది… నెయ్యి ఉత్పత్తిని పెంచడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. మేము డిమాండ్‌ను తీర్చగలము.” అని కర్ణాటక మిల్క్ ఫెడరేన్ ఛైర్మన్ భీమా నాయక్ చెప్పారు.
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!