Anna Sebastian Perayil: పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్.. ఈ నెలలో వివాహం జరగాల్సి ఉంది..
- సంచలనంగా మారిన అన్నా సెబాస్టియన్ మృతి..
- పని ఒత్తిడే కారణమని తల్లి ఆరోపణ..
- ఈ నెలలో వివాహం కావాల్సి ఉందన్న కజిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Sebastian Perayil: ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియా కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ వర్క్ కల్చర్, పని ఒత్తిడి ఆమె మృతికి కారణమైనట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నా మరణం తర్వాత దేశవ్యాపంగా చాలా మంది ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా హైలెట్ చేశారు. కొందరు కార్పొరేట్ ఉద్యోగం అంటే చాలా కష్టమంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు కొన్ని కంపెనీల్లో తమపై సీనియర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని ఎదిరిస్తే పని ఒత్తిడితో వేధిస్తున్నారంటూ చెప్పారు. కేరళ కొచ్చికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జూలై 20న మరణించారు. ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స చెందుతూ మరణించారు.
Read Also: Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇదిలా ఉంటే, అన్నాకి ఈ నెలలో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. అన్నా తల్లి అనితా అగస్టిన్ EY ఇండియా ఛైర్మన్ రాజీవ్ మెమానీకి తన కుమార్తె పనిలో ఎదుర్కొన్న సవాళ్లపై ఒక లేఖ రాసిన తర్వాత, ఆయన సామరస్యపూర్వకమైన ఆఫీసుని రూపొందించే వరకు తాను విశ్రమించనని చెప్పారు.
అన్నాతో ఉన్న అనుబంధాన్ని ఆమె కజిన్ సునీల్ జార్జ్ కురువిల్లా పంచుకున్నారు. శుక్రవారం ఆయన లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ కన్నీళ్లు తెప్పించాయి. అన్నా శాశ్వతంగా వెళ్లిపోయింది, కానీ ఆమె గతంలో కన్నా మరింత శక్తివంతంగా మారిందని అన్నారు. అధికారుల బారి నుంచి యువ జీవితాలను ఆమె రక్షించవచ్చని అన్నారు. ఈ నెలలోనే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది అని చెప్పారు. అన్నా మరణం తర్వాత ఉద్యోగుల పని గంటల్లో మార్పులు రావాలనే ప్రతీ ఒక్కరు వ్యాఖ్యానిస్తున్నారు. కేరళ ఎంపీ శశిథరూర్ ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..