Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసం.. ఏకంగా 50 మంది మహిళల ట్రాప్..
- పెళ్లి పేరుతో మోసాలు..
- మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా నకిలీ ప్రొఫైల్స్..
- వెలుగులోకి మరో కేసు.. ఏకంగా 50 మంది మహిళల్ని మోసం చేసిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసాలు పెరిగిపోతున్నాయి. తమను తాము ఉన్నత ఉద్యోగినని, ప్రభుత్వ అధికారి అని నమ్మిస్తూ మహిళల్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది మహిళల్ని ట్రాప్ చేశాడు ఓ కేటుగాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు 38 ఏళ్ల ముఖీమ్ ఖాన్‌కి అప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఆరు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు.
మ్యాట్రిమోనీ సైట్లలో అనేక నకిలీ ప్రొఫైళ్లను క్రియేట్ చేసి, తాను హోం మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా చెప్పుకుంటూ, కల్పిత కథలు చెబుతూ పలువురు మహిళల్ని ఆకర్షించాడు. ఈ బాధితుల్లో ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళా న్యాయ అధికారి కూడా ఉన్నారు. బలహీనమైన మహిళల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడే వాడు. మహిళల్ని నమ్మించేందుకు కొన్ని నెలల పాటు అతను ఓపికగా తన ప్లాన్ అమలు చేసే వాడు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
Read Also: Modi’s US Visit 2014: ‘నా తల్లి ఇల్లు మీ కారుతో సమానం’..10ఏళ్ల ముందు ఒబామాకు మోడీ చెప్పిన మాట
ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల్నే టార్గెట్ చేసేవాడు. తన భార్య చనిపోయిందని, కుమార్తెకు ఆర్థిక సాయం కోసం కష్టపడుతున్న తండ్రిగా బిల్డప్ ఇచ్చే వాడు. మహిళల్ని ముగ్గులోకి దించి ముకీమ్ మ్యారేజ్ ప్లాన్ కూడా రూపొందించేవాడు. ఆభరణాలు, ప్రయాణాలకు నకిలీ బిల్లులను కూడా తయారు చేసుకునే వాడు. వీటి ఖర్చుల కోసం బాధితురాళ్లు నిందితుడు ఎలాగో ఒప్పించేవాడు. చివరకు పెళ్లికి ముందే ఓ బైక్ కొనిచ్చేలా బాధిరాలని మోసం చేశాడు. ఆ తర్వాత బైక్‌తో ఉడాయించాడు. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, గత కొన్నేళ్లుగా ముకీమ్ పట్టుబడకుండా తప్పించుకున్నాడు. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఇతడి ఆచూకీని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు.
- Tags
- Matrimonial frauds
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి