Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు.
Bengaluru: బెంగళూర్‌లో ఓ విచిత్రమైన దొంగతనాలు బయటపడ్డాయి. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ‘‘పావురాలను’’ ఉపయోగించడం సంచలనంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడానికి దొంగ పావురాలను వాడుకుంటున్నాడే విషయం తెలిసి బెంగళూర్ సిటీ మార్కెట్ పోలీసులు షాక్ అయ్యారు.
Asaduddin Owaisi: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ కూడా ఇలాంటి విమర్శలనే చేసింది.
Sabarimala pilgrimage: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని కేరళలోని సీఎం పినరయి విజయన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వతా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శబరిమలలో రాబోయే మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌కి ఆన్లైన్ బుకింగ్స్ అమలు చేయాలని
PM Modi: హర్యానాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. వరసగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. జమ్మూ కాశ్మీర్లో అధికారం చేపట్టలేకపోయినప్పటికీ 90 స్థానాల్లో 29 స్థానాలను సాధించింది. ఇక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. రాహుల్ గాంధీ ప్రచారం, అగ్నివీర్ అంశం, నిరుద్యోగం, వినేష్ ఫోగట్ చేరిక, రైతు ఉద్యమాలు ఇలా ఏదీ కూడా బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి. 37 సీట్లలోనే కాంగ్రెస్ గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో మరింత దారుణం 6 సీట్లను…
RSS: బీజేపీ, తన మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి హర్యానా గెలుపే నిదర్శనం. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయలేదని, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో హర్యానాలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందనే ఊహాగానాల నుంచి భారీ గెలుపు దిశగా పయణించింది. వరసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించింది.
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఓడిపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.
Haryana Elections: 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానాలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కాంగ్రెస్‌కి ఘోర పరాభవం తప్పలేదు. ఇదిలా ఉంటే హర్యానా ఫలితాల అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 51కి చేరింది.
ఇప్పుడు ఈ నక్షత్రం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ఔత్సాహికుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 1946లో చివరిసారిగా ఇది కనిపించింది. నార్తర్న్ క్రౌన్ నక్షత్రమండలంలో విస్పోటనం చెందిన సమయంలో భూమి నుంచి చివరిసారిగా ఈ నక్షత్రం కనిపించింది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఏ క్షణంలో అయినా ఈ నక్షత్రం ఆకాశంలో దర్శనమిస్తుందని చెబుతున్నారు.
Shivraj Chouhan: జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక హామీ ఇచ్చింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్(ఎన్ఆర్సీ) అమలు చేస్తామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.