Newborn girl: తమిళనాడులో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని మైలాడుతురై బస్టాండ్‌లోని పబ్లిక్ టాయిలెట్లో నవజాత శిశువు దొరికింది. కొన్ని గంటల క్రితమే పుట్టిన ఆడశిశువును వదిలివెళ్లారు. పారిశుద్ధ్య సిబ్బంది శిశును గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం నవజాత బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. హర్యానాలో ఈసారి అధికారం కాంగ్రెస్‌దే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి., అయితే తీరా ఫలితాలు చూస్తే, బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 37 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అతివిశ్వాసమే ఆ పార్టీ కొంపముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ […]
Ratan Tata: రతన్ టాటా.. భారత పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేశారు. గుండు సూది నుంచి విమానాల వరకు అనేక కంపెనీలతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రతన్ టాటా తన సత్తాని చాటారు. ఇండికా నుంచి మొదలైన టాటా మోటార్స్ ప్రస్థానం ఇప్పుడు టాటా నెక్సాన్.ఈవీ దాకా కొనసాగింది. ప్రస్తుతం ఇండియాలో ఈవీ కార్లలో టాటా తిరుగులేని స్థానంలో ఉంది.
TATA vs Pakistan Economy: భారత పారిశ్రామిక దిగ్గజం, గొప్ప మానవతావాది, ఫిలాంత్రోపిస్ట్ రతన్ టాటా కన్నుమూశారు. 86 వయసులో ఆయన స్వర్గస్తులయ్యారు. అయితే, గుండు సూది నుంచి విమానం వరకు, ఉప్పు నుంచి ఆటోమోబైల్స్ వరకు టాటా వస్తువులు లేని ఇళ్లు భారతదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, దాదాది దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, టాటా గ్రూప్ మొత్తం విలువ కన్నా తక్కువ.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 2019లో తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో హూస్టల్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ సభపై మాట్లాడారు. కమిడియన్స్ ఆండ్రూ షుల్ట్జ్, ఆకాష్ సింగ్‌తో కలిసి ‘‘ఫ్లాగ్రాంట్’’ పోడ్‌కాస్టులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ భేటీలో పీఎం మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ బయటకు శాంతంగా, తండ్రిలా కనిపిస్తారు కానీ, ఆయన కఠినంగా ఉండే మంచి వ్యక్తి అని అభివర్ణించారు
ఏ సంస్థ అయితే తనను అవమానించిందో, అదే సంస్థను కొనుగోలు చేసి బ్రిటీష్ వాళ్ల గర్వాన్ని అణిచివేశారు రతన్ టాటా. ఇది రతన్ టాటాకు వ్యాపార విజయం కన్నా, వ్యక్తిగత విషయంగా పరిగణించబడుతుంది.
Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం, దానకర్ణుడు రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని కొతపుంతలు తొక్కించిన వ్యక్తిగా రతన్ టాటా ఖ్యాతికెక్కారు. తాను సంపాదించిన డబ్బును అనేక ఛారిటీ సంస్థలకు, సేవలకు ఉపయోగించి మహోన్నత వ్యక్తిగా నిలిచారు. రతన్ టాటా మరణం దేశానికి తీరనిలోటుగా దేశ ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ నేతల దగ్గర నుంచి పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర ప్రముఖులు టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల సంస్థలకు అధిపతిగా ఉన్నా కూడా గర్వమనేది…
Kerala High Court: కేరళ మాజీ ఆర్థిక మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు, ఓ యువతి షరియా చట్టాన్ని ఉల్లంఘించిందని, ఆమె అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసులు రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఏ మత విశ్వాసం కూడా రాజ్యాంగానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Ratan Tata: టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని వర్గాల బుధవారం ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపాయి. 86 ఏళ్ల టాటా సోమవారం వయో సంబంధిత అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Bangladesh: రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఆ తర్వాత పరిణామాల్లో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కిలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారో, అప్పటి నుంచి ఆ దేశంలో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు యాక్టివ్ అయ్యాయి. యూనస్ ప్రభుత్వం పలువురు ర్యాడికల్ ఇస్లామిక్ నేతల్ని విడుదల చేసింది.