Uttar Pradesh: నిజమైన వాటర్ బాటిల్ పేర్లకు బదులుగా అదే పేరులా కనిపించే వేరే వాటర్ బాటిళ్లను మార్కెట్లో చూస్తుంటాం. కేవలం స్పెల్లింగ్‌ని మార్చి, బ్రాండెంట్ వాటర్ బాటిల్లా కనిపించేలా తయారు చేస్తుంటారు. బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్లలో మనకు ఎక్కడో చోట ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌కి కూడా ఇదే ఘటన ఎదురైంది.
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి.
Karnataka:కర్ణాటకలోని ‘‘ఇజ్రాయిల్’’ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీ ఇప్పుడు తన పేరుని ‘‘జెరూసలెం’’ ట్రావెల్స్‌గా మార్చుకుంది. మిడిల్ ఈస్ట్‌లోని ఇజ్రాయిల్-హమాస్, హిజ్బుల్లా యుద్ధాలు కర్ణాటకలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఓ వర్గం వారు ఇజ్రాయిల్ ట్రావెల్స్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చర్చనీయాంశం అవుతున్న వేల, ఈ ఇజ్రాయిల్ ట్రావెల్ ఉన్న బస్సు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు.
Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు మేదినిపూర్‌లో ఓ నిందితుడు పొరుగించిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలిని పటాష్పూర్లోని నిందితుడి పక్కింటిలో ఉన్న మహిళగా గుర్తించారు. ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బలవంతంగా విషం తాగించాడు.
అయితే, పేజర్లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది.
Bengal girl murder: పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ట్యూషన్ క్లాస్‌కి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసి పొలాల్లో శవాన్ని పారేశారు. ఈ ఘటన దక్షిణ్ 24 పరగణాస్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే ఈ దారుణం జరగడంతో స్థానికంగా తీవ్ర నిరసనలకు, హింసాత్మక ఘటనలకు కారణమైంది.
Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. బీజేపీకి కేవలం 20-28 సీట్లు…
RSS chief: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందువులకు కీలక సూచన చేశారు. హిందువులు తమ సొంత భద్రత కోసం భాష, కులం, ప్రాంతం అనే అన్ని విభేధాలను మరించి వివాదాలను నిర్మూలించడం ద్వారా ఐక్యంగా ఉండాలి అని కోరారు. రాజస్థాన్ బరన్‌లో జరిగి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి భగవంత్ మాట్లాడుతూ.. హిందువులు అన్ని భేదాలను మరించి ఐక్యంగా ఉండాలని సూచించారు.
Gujarat: గుజరాత్ వడోదరలో దారుణం జరిగింది. తన ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజ్ యువతిపై గుర్తుతెలియన వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె స్నేహితుడిని అడ్డుకున్న దుండగులు బాలికపై అత్యాచారం చేశారని శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటన నవరాత్రి సందర్భంగా గర్భా ఈవెంట్ కోసం నగరానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు జరిగింది.