Bill Gates tribute to Ratan Tata: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశంపై, ప్రపంచంపై చెరగని ముద్రవేసింది’’
UNICEF Report: ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మందికి పైగా బాలికలు మరియు మహిళలు తమ చిన్నతనంలో అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 18 ఏళ్ల లోపు ప్రతీ 8 మందిలో ఒక బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. పిల్లలపై లైంగిక హింసపై మొట్టమొదటిసారిగా ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో రిపోర్ట్ వెలుబడింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలికలకు ఈ వేధింపులు జీవితకాల చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయని రిపోర్ట్ వెల్లడించింది.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ -శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహాయుతి’’ కూటమి భావిస్తుంటే, బీజేపీ కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘‘మహావికాస్ అఘాడీ’’ భావిస్తోంది. నవంబర్ నెలలో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
Agniveers: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టిలరీ సెంటర్ ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఇద్దరు అగ్నివీరులు మరణించారు. ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ ఫైర్ కావడంతో ఇద్దరు మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం మధ్యామ్నం నాసిక్ రోడ్ ప్రాంతంలోని ఆర్టిలరీ సెంటర్లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
AAP: అతివిశ్వాసంతో కాంగ్రెస్ హర్యానాని చేజేతుల చేజార్చుకుంది. తామే గెలుస్తామనే అతి నమ్మకంతో ఆప్ పార్టీలో పొత్తు పెట్టుకోలేదు. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటును ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీల్చగలిగింది. దీంతో కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ ఓట్లతో బీజేపీ కన్నా 11 సీట్లను వెనకబడింది
Noel Tata: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ కొత్త అధినేతగా నోయెల్ టాటా నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్గా ఎన్నుకున్నారు.
Hubballi riot: 2022 కర్ణాటక హుబ్బల్లి అల్లర్లు, మతకలహాల కేసులో కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసులపై దాడి చేసిన గుంపు నాయకత్వం వహించారే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇతెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నాయకులపై కేసులు ఉపసంహరించుకుంది.
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
Ratan Tata family tree: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుండు సూది నుంచి ఎయిర్ ప్లేన్స్ వరకు అన్ని రంగాల్లో సత్తా చాటారు. పెద్ద పారిశ్రామికవేత్తగానే కాకుండా.. దాతృత్వం పరంగా ఉన్నత స్థానంలో నిలిచారు.
Hizb-ut-Tahrir: ఐఎస్ఐఎస్ ప్రేరేపిత రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’(HuT)ని కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద ఉగ్రవాద సంస్థగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) గురువారం అధికారికంగా ప్రకటించింది.