Blaze Star: జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చూసే ఖగోళ అద్భుతం..80 ఏళ్ల తర్వాత కొత్త నక్షత్రం..
- జీవితంలో ఒక్కసారి మాత్రమే చూసే ఖగోళ అద్భుతం..
- 80 ఏళ్ల తర్వాత ఆకాశంలో కొత్త నక్షత్రం..
- చివరిసారిగా 1946లో పేలిన ‘బ్లేజ్ స్టార్’..
- ధృవ నక్షత్రం అంతటి ప్రకాశవంతమైన కాంతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blaze Star: ఈ విశ్వంలో ఖగోళ అద్భుతాలకు లెక్క లేదు. మానవుడు విశ్వాన్ని ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా, ఏదో ఒక కొత్త విషయం మిగిలే ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ ఇలా ప్రతీది మానవుడికి సవాల్ విసురుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మానవ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూసే అరుదైన ఖగోళ అద్భుతం జరగబోతోంది. ‘‘బ్లేజ్ స్టార్’’ లేదా ‘‘ T కరోనా బొరియాలిస్’’ అని పిలిచే నక్షత్రం 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆకాశంలో దర్శనమివ్వబోతోంది.
Read Also: Shivraj Chouhan: జార్ఖండ్‌లో ఎన్ఆర్‌సీ అమలు చేసి, బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని ఏరేస్తాం..
Also Read
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్‌ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
ఇప్పుడు ఈ నక్షత్రం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ఔత్సాహికుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 1946లో చివరిసారిగా ఇది కనిపించింది. నార్తర్న్ క్రౌన్ నక్షత్రమండలంలో విస్పోటనం చెందిన సమయంలో భూమి నుంచి చివరిసారిగా ఈ నక్షత్రం కనిపించింది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఏ క్షణంలో అయినా ఈ నక్షత్రం ఆకాశంలో దర్శనమిస్తుందని చెబుతున్నారు.
భూమి నుంచి 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘‘చనిపోయిన నక్షత్రం’’ వల్ల ఈ ఖగోళ అద్భుతం ఏర్పడుతుంది. మరోసారి భారీ పేలుడుతో ఇది నక్షత్రంలా కనిపిస్తుంది. ‘‘నార్త్ స్టార్’’(ధృవ నక్షత్రం) అంతటి ప్రకాశవంతంగా ఆకాశంలో అద్భుతంగా కనిపిస్తుంది. ‘‘నోవా’’ కొన్ని రోజుల పాటు కనిపించి అదృశ్యమవుతుంది. మరో 80 ఏళ్ల తర్వాతే కనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. ఒక నక్షత్రం విస్పోటనం చెందడం మానవ జీవితంలో చూడటం చాలా అరుదు. ఈ నక్షత్రాన్ని మొదటిసారిగా 1217లో జర్మనీ ఉర్స్‌బెర్గ్‌కి చెందిన బుర్చర్డ్ అనే వ్యక్తి రికార్డ్ చేశాడు. అతడు దీనిని ‘‘ఒకసారి గొప్ప కాంతితో ప్రకాశించే పెద్ద నక్షత్రం’’గా అభివర్ణించాడు.
తాజావార్తలు
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్‌ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్‌ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!