Congress: “అహంకారం, అతి విశ్వాసం”.. కాంగ్రెస్‌ని ఏకిపారేస్తున్న మిత్రపక్షాలు..
- హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయం..
- కాంగ్రెస్‌ని ఏకిపారేస్తున్న మిత్ర పక్షాలు..
- అహంకారం.. అతివిశ్వాసంతోనే కాంగ్రెస్ ఓటమి..
- ఉద్ధవ్ శివసేన..టీఎంసీ..ఎన్సీల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్‌లో కూడా బీజేపీ సత్తా చాటింది. అధికారం దక్కకపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే, ఈ ఫలితాలు ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ టార్గెట్‌గా మిత్రపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఉద్థవ్ ఠాక్రే శివసేన తన సామ్నా పత్రిక ద్వారా కాంగ్రెస్‌ని విమర్శించింది. ఆప్‌తో పొత్తు పెట్టుకోవడంతో పాటు స్థానిక నాయకుల్లో అవిధేయతను నియంత్రించడంలో విఫలమైందని చెప్పింది. గెలిచే ఇన్సింగ్స్‌ని ఓటమిగా మార్చిందని కాంగ్రెస్‌ని ఎండగట్టింది. అయితే, మిత్ర పక్షం ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యాఖ్యల్ని కాంగ్రెస్ మహరాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. హర్యానా, మహారాష్ట్ర వేర్వేరు రాజకీయ నేపథ్యాల్ని కలిగి ఉన్నాయని, మహారాష్ట్రలో జ్యోతీరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ భావజాలం ఉందని అన్నారు.
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
Read Also: Haryana Elections: బీజేపీకి పెరిగిన మరింత బలం.. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరిక..
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పొత్తులో ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అతివిశ్వాసం కొంపముంచిందని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గతేడాది చివర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలని సామ్నాలో ప్రస్తావించింది శివసేన, అతి విశ్వాసంతోనే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పింది. భూపిందర్ హుడా, కుమారి సెల్జాల మధ్య ఆధిపత్య పోరుని కూడా సామ్నాలో పేర్కొంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ది అహంకారపూరిత ధోరణి అని అభివర్ణించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్ వైఖరిని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై లోతైన సమీక్ష చేసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “హర్యానాలో బిజెపి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ దీనిపై లోతైన చర్చలు జరపాలి, కానీ అది నా పని కాదు” అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!