Samajwadi Party: కాంగ్రెస్‌కి అఖిలేష్ యాదవ్ షాక్.. ఉప ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌కి ‘నో’..
- హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కి వరస షాక్‌లు..
- సీట్ల షేరింగ్‌కి ‘నో’ చెప్పిన అఖిలేష్ యాదవ్ పార్టీ..
- ఈ ఏడాది చివర్లో యూపీలో బై-ఎలక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు. ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడటంతో పలు పార్టీలు ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచిస్తున్నాయి. ఈ ప్రభావం వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పడబోతోంది.
ఇదిలా ఉంటే, ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. త్వరలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. ఈ ఏడాది చివర్లలో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రదర్శనను చూపెడుతూ.. ఆ పార్టీ ప్రపోజల్‌ని ఎస్పీ తిరస్కరించింది.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
Read Also: Honor Tablet GT Pro: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. డిజైన్, ఫీచర్లు ఇవే
త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గానూ 06 స్థానాలకు ఎస్పీ తన అభ్యర్థుల్ని బుధవారం ప్రకటించింది. కర్హల్ నుండి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము స్థానం నుండి నసీమ్ సోలంకి, ఫుల్‌పూర్ (ప్రయాగ్‌రాజ్) నుండి ముస్తఫా సిద్దిఖీ , మిల్కిపూర్ (అయోధ్య) నుండి అజిత్ ప్రసాద్‌లకు టికెట్ ఇచ్చింది. కతేహరి, మజ్వాన్ స్థానాల నుంచి శోభావాయ్ వర్మ, జ్యోతి బింద్‌లకు పార్టీ బరిలోకి దింపింది. ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా.. హర్యానాలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి ప్రస్తావించారు. వారు సమాజ్‌వాదీ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, మొత్తం రాష్ట్రాన్ని బీజేపీ ఇచ్చారని అన్నారు.
సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఈ రోజు హర్యానాలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదని ఆయన అన్నారు. యూపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భావిస్తున్నామని, అందుకే ఆరుగురు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు రవిదాస్ చెప్పారు. మిగిలిన 4 స్థానాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. తమను సంప్రదించకుండా ఎస్పీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్ అవినాష్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?