Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా మెజారిటీ ఫిగర్ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూలో బీజేపీకి గణనీయమైన సీట్లు వస్తాయని, కాశ్మీర్‌లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తాయని చెప్పాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి.
Hezbollah: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కకావిలకం అవుతోంది. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో బీరూట్ దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లను వెతికి వెంటాడి చంపేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లాని బీరూట్ దాడిలో ఇజ్రాయిల్ చంపేసింది.
Maldives: ‘‘ ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇప్పుడు భారతదేశ శరణు కోరేందుకు వచ్చాడు. ఏడాది క్రితం చైనాను చూసుకుని రెచ్చిపోయిన ముయిజ్జూకి, అక్కడి ప్రభుత్వానికి అసలు సమస్య వచ్చే సమయానికి ఇండియా గుర్తుకు వచ్చింది.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు తెహ్రీక్ ఇ తాలిబాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులతో సతమతం అవుతోంది. ఈ రెండు గ్రూపులు ఒకరు ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో విరుచుకుపుడుతున్నాయి. ముఖ్యంగా బీఏల్ఏ మిలిటెంట్లు పాకిస్తాన్ సైన్యం
Shocking: పాకిస్తాన్లో దారుణం జరిగింది. తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లికి అడ్డు చెబుతున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ ఘటన సింధ్ ప్రావిన్సులోని ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది. తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ప్రియుడితో కలిసి యువతి కుట్ర పన్నింది.
Supreme Court: నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు క్యాంటీన్లో మాంసాహారాన్ని అనుమతించడంపై వివాదం మొదలైంది. క్యాంటీన్లో మాంసాహారాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల బృందం కోర్టు బార్ అసోసియేషన్, ఇతర న్యాయ సంఘాలను ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టులో పెద్ద దుమారానికి కారణమైంది.
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ, వాష్ బేసిన్ కూడా తొలగించారు’’ అని…
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌పై సామూహిక అత్యాచార ఆరోపణల్ని సీబీఐ కొట్టిపారేసింది. సంజయ్ రాయ్ అనే నిందితుడు వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల విచారణ తర్వాత సీబీఐ ఈ రోజు మధ్యాహ్నం సీల్దా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో రాయ్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న…
Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలకమైన విన్యాసాన్ని నిర్వహించింది. 15 కిలోమీటర్ల ఎత్తుకు పైన ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్ లాంటి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చేసింది
Iran: ఇరాన్‌కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్(IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ శుక్రవారం బీరుట్లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత నుంచి మిస్సయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియా ఇతడి ఆచూకీ గురించి మౌనంగా ఉండగా.. టర్కీష్, ఇజ్రాయిల్ మీడియాలు మాత్రం ఖానీ చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నాయి.