Hamas: హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా మంది మరణించారు.
Baba Siddique Murder: ప్రముఖ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారానికి కారణమైంది. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాయలం సమీపంలో గత రాత్రి కాల్చి చంపారు. ఈ హత్యని రాజకీయం చేయవద్దని బీజేపీ నేతృత్వంలోని మహా ప్రభుత్వం అభ్యర్థించగా..
Crime: బాయ్‌ఫ్రెండ్ నమ్మి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు, అతని ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ప్రియుడితో పాటు అతని ఇద్దరు మైనర్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక లవర్ని చాంద్‌గా గుర్తించారు.
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తామని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్‌గా గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు.
US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది.
Pakistan: ఇటీవల పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో చైనీయులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపుల పేలుడు కారణంగా ఇద్దరు చైనా పౌరులు మరణించగా, 17 మంది గాయపడ్డారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా-పాకిస్తాన్ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతోనే దాడి జరిగినట్లు అక్కడి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
Kolkata: కోల్‌కతాలో కొందరు మతోన్మాదుల ముస్లింమూక దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. నగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్‌కి చెందిన పూజా మండపై ముస్లిం గుప్పు దాడి చేసి, పూజలు నిర్వహించరాని బెదిరించారు. దాదాపుగా 50-60 మంది సభ్యులతో కూడిన ముస్లిం గుంపు వేడకల్ని ఆపకపోతే విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. Read Also: India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్ […]
India - Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా రాడికల్ ముస్లింగుంపు దాడులకు తెగబడుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయి, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది.
Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్ కేంద్రంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లబోతున్నారు.