Noel Tata: టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయల్ టాటా.. ఎవరితను..?
- టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయల్ టాటా..
- రతన్ టాటా మరణం తర్వాత ఎన్నుకున్న బోర్డ్ మెంబర్స్..
- 40 ఏళ్లకు పైగా టాటా గ్రూప్‌లో వ్యాపార అనుభవం... రతన్ టాటాకి సవతి సోదరుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noel Tata: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ కొత్త అధినేతగా నోయెల్ టాటా నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
అసలు ఎవరీ నోయెట్ టాటా..?
Also Read
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
రతన్ టాటా, జిమ్మీ టాటాల సవతి సోదరుడు నోయల్ టాటా ప్రస్తుతం టాటా గ్రూపులో ప్రముఖ వ్యక్తి. ఇతను టాటా ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ చైర్మన్. టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా గ్రూప్ అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తు్న్నారు.
నవాల్ హెచ్ టాటా, సూనూ కమిసరియంట్ దంపతులకు రతన్ టాటా, జమ్మీ టాటా జన్మించారు. అయితే, రతన్ పదేళ్ల వయసులో నవాల్ టాటా, సూనూ విడాకులు తీసుకున్నారు. నావల్ టాటా ఆ తర్వాత సిమోన్ డునోయర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన వ్యక్తే నోయల్ టాటా. రతన్ టాటాకు నోయెల్ టాటా సవతి సోదరుడు.
నోయల్ టాటా టాటా స్టీల్, వాచ్ కంపెనీ టైటాన్‌కి వైస్ చైర్మన్. టాటా రిటైల్ విభాగం ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం నోయల్ టాటా ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ మరియు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా సన్స్ యాజమాన్యంలో 50 శాతానికి పైగా ఉన్న సర్ రతన్ టాటా ట్రస్ట్ మరియు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో అతను ట్రస్టీగా కూడా పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం నోయల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో ఛైర్మన్‌గా, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. నోయల్ టాటా గతంలో టాటా సన్స్ చైర్మన్ పదవి దక్కుతుందని అనుకున్నారు. అయితే, నోయెల్ భావ సైరన్ మిస్త్రీకి ఈ బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత మిస్త్రీ నిష్క్రమణ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చీఫ్ ఎన్ చంద్రశేఖరణ్ టాటా సన్స్ చైర్మన్ అయ్యారు.
టాటా గ్రూపులో దాదాపుగా 40 ఏళ్ల వ్యాపార అనుభవం నోయెల్ టాటా సొంతం. నోయెట్ టాటా మరో ప్రసిద్ధి పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు లీహ్ టాటా, మాయా టాటా, నివిల్లే టాటా. వీరు కూడా టాటా గ్రూపులో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. లీహ్ టాటా ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. మాయా టాటా టాటా క్యాపిటల్‌లో అనలిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి, కంపెనీలో క్రమంగా ఎదుగుతున్నారు. నెవిల్లే టాటా టాటా యాజమాన్యంలోని ట్రెంట్‌తో తన వ్యాపార కెరీర్‌ని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!