Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్‌గేట్స్ నివాళి..
- రతన్ టాటా మరణం ప్రపంచానికి నష్టం..
- ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తి..
- మానవాళికి ఆయన సేవ నన్ను కదిలించింది..
- టాటాకి నివాళులు అర్పించిన బిల్ గేట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates tribute to Ratan Tata: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశంపై, ప్రపంచంపై చెరగని ముద్రవేసింది’’ అని లింక్డ్‌ఇన్ పోస్టులో అన్నారు. తాను రతన్ టాటాని అనేక సందర్భాల్లో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఉద్దేశ్యం, మానవాళికి చేసే సేవ నన్ను ఎప్పుడూ కదిలించాయని అన్నారు. అనేక కార్యక్రమాల్లో టాటాతో కలిసి పనిచేయడాన్ని గుర్తు చేసుకున్నారు. అతడి వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చెప్పారు.
Read Also: Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
“రతన్ టాటా ఒక దార్శనిక నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. నేను అనేక సందర్భాల్లో అతనిని కలిసే అవకాశం దక్కింది. అతని ఉద్దేశ్యం మరియు మానవాళికి సేవ చేయాలనే బలమైన భావనతో నన్ను ఎల్లప్పుడూ కదిలించాయి’’ అని రతన్ టాటాతో ఉన్న ఫోటోని బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. రతన్ టాటా మృతి రాబోయే కాలంలో ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది, అయితే అతను వదిలివెళ్లిన వారసత్వం, అతను సెట్ చేసిన మార్గదర్శకాలు తదుపరి తరాలకు స్పూర్తినిస్తాయని అన్నారు.
గత ఏడాది మార్చిలో రతన్ టాటాని బిల్ గేట్స్ అతని భారత పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురు దాతృత్వం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్యం, రోగనిర్ధారణ, పోషకాహారం వంటి అంశాలపై భాగస్వామ్యం గురించి చర్చించారు. భారత పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. అతడి మృతిపై రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల వరకు అందర్ని శోకసంద్రంలో ముంచింది. భారత ప్రజలు ఒక రత్నాన్ని కోల్పోయామని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..