UNICEF Report: ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మందికి పైగా బాలికలు మరియు మహిళలు తమ చిన్నతనంలో అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 18 ఏళ్ల లోపు ప్రతీ 8 మందిలో ఒక బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. పిల్లలపై లైంగిక హింసపై మొట్టమొదటిసారిగా ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో రిపోర్ట్ వెలుబడింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలికలకు ఈ వేధింపులు జీవితకాల చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయని రిపోర్ట్ వెల్లడించింది.
‘‘నాన్-కాంటాక్స్’’ లైంగిక వేధింపులు.. అంటే ఆన్‌లైన్, మాటరూపంలో వేధింపులకు పాల్పడటం వంటి వాటిని చేర్చితే, వేధింపులు ఎదుర్కొన్న వారి సంఖ్య 65 కోట్లకు పెరుగుతుందని రిపోర్ట్ వెల్లడించింది. ఇలాంటి వేధింపులను ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురు బాలికల్లో ఒకరు ఎదుర్కొంటున్నారు. వీటిని నివారించేందుకు సమగ్రమైన నివారణ, వ్యూహాలు, తక్షణ అవసరం అవసరమని నివేదిక నొక్కి చెప్పింది. అన్ని రకాల హింసలు, దుర్వినియోగాలను అరికట్టాలని సూచించింది.
‘‘పిల్లలపై లైంగిక హింస మన నైతిక మనస్సాక్షికి మచ్చ’’ అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ అన్నారు. ఇది పిల్లలపై మనసుపై లోతైన, శాశ్వతమైన గాయాన్ని కలిగిస్తుందని అన్నారు. తరుచుగా పిల్లలు తమకు తెలిసిన వారి నుంచి, తాము సురక్షితంగా ఉన్నామని భావించే ప్రాంతాల నుంచే వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పిల్లలపై హింస అనేది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉందని నివేదిక తెలిపింది.
Read Also: Balakrishna: నాకు, నా భార్యకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారా!.. బాలకృష్ణ ఫన్నీ కామెంట్స్
సబ్ సహారా ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో బాధితులు ఉన్నారు. 79 మిలియన్ల మంది (22శాతం) ప్రభావితమయ్యారు. తూర్పు-ఆగ్నేయ ఆసియాలో 75 మిలియన్లు(8శాతం), మధ్య-దక్షిణ ఆసియాలో 73 మిలియన్లు(9 శాతం), యూరప్-ఉత్తర అమెరికాలో 68 మిలియన్లు(14 శాతం), లాటిన్ అమెరికా-కరేబియన్ ప్రాంతంలో 45 మిలియన్లు(18 శాతం), ఉత్తర ఆఫ్రికా-పశ్చిమాసియాలో 29 మిలియన్లు(15 శాతం), ఓషియానియాలో 6 మిలియన్లు(34 శాతం) మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు.
భద్రతా సంక్షోభాలు, హింస నుంచి పెద్ద సంఖ్యలో పారిపోతున్న శరణార్ధులు, ఇలాంటి పరిస్థితుల్లో బాలికలు అత్యాచారాలను ఎదుర్కోవడంలో ఎక్కువ రిస్కుని కలిగి ఉన్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పరిస్థితులు అధ్వానంగా ఉన్న సమయంలో పిల్లలు లైంగిక హింసకు గురవుతున్నారు. లైంగిక హింసను అనుభవించే పిల్లలు పదేపదే వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతన్నాయి.
ఇలాంటి హింస నుంచి బయటపడిన వారు, ఈ వేధనను తమ జీవితాతం భరించాల్సి వస్తోంది. లైంగిక సంక్రమించే వ్యాధులే కాకుండా, మాదవద్రవ్యాల వినియోగం, సామాజిక ఒంటరితనం, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఈ విషయాలను బయటకు చెప్పకపోతే, దీని ప్రభావం మరింతగా ఉంటోంది. ఇక బాలుర విషయానికి వస్తే 24 కోట్లు-31 కోట్ల మంది బాలురు, అంటే ప్రతీ 11 మందిలో ఒకరు అత్యాచారానికి లేదా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. నాన్ కాంటాక్ట్ వేధింపులని పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య 41 కోట్ల నుంచి 53 కోట్ల వరకు ఉంటుంది.
వచ్చే నెలలో కొలంబియాలో పిల్లలపై హింసపై తొలి గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సమావేశం జరగబోతోంది. దీంట్లో కార్యకర్తలు, ప్రాణాలతో బయటపడినవారు , యువతతో సహా ప్రభుత్వ నాయకులు , పౌర సమాజం పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే బాల్య లైంగిక హింసను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త చర్య యొక్క తక్షణ అవసరాన్ని డేటా హైలైట్ చేస్తుంది.