Allahabad HC: ఒక వ్యక్తిపై భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపుల ఆరోపణల్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపబ్టింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆమె ఆరోపణలు చేసిందని కోర్టు భావించింది. మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు మహిళ ఆరోపణల్ని కొట్టిపారేసింది. వరకట్న వేధింపులతో పాటు తన భర్త అసహజ సెక్స్‌కి బలవంతంగా చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలు అన్నింటి కోర్టు కొట్టివేసింది.
RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్ వేదికగా దసరా ప్రసంగాన్ని ఇచ్చారు. గత కొన్నేల్లుగా మెరుగైన విశ్వసనీయతతో భారతదేశం ప్రపంచంలో మరింత పటిష్టంగా, మరింత గౌరవంగా మారిందని ఆయన అన్నారు. అయితే, దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని శనివారం భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందని అన్నారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. లేకున్నా వ్యక్తిగత, జాతీయ స్వభావాల దృఢత్వం, ధర్మం యొక్క విజయానికి బలమైన పునాదిగా మారుతుందని…
Haryana elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ చేతిలో అనూహ్యమైన ఓటమితో కాంగ్రెస్ హైకమాండ్, కార్యకర్తలు ఢీలా పడ్డారు. చాలా చోట్ల తాము గెలుస్తామని అనుకున్నప్పటికీ ఓటమి మరోసారి పలకరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, 37 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమువుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ ప్రాక్సీలైన హిజ్బుల్లా, హమాస్‌లను హతం చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా కీలక నాయకుడు హసన్ నస్రల్లాని చంపేసింది, ఆ తర్వాత హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న హసీమ్ సఫీద్దీన్‌ని కూడా చంపేసింది. హిజ్బుల్లా ప్రధాన కమాండర్లని చంపేసింది. ఇదిలా ఉంటే, హజ్బుల్లాపై దాడికి ప్రతిస్పందనగా, ఇటీవల ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగింది.
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల కాంగ్రెస్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‘‘అర్బన్ నక్సల్స్’’ పార్టీ అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు.
Crime: 17 ఏళ్ల కూతురు లవ్ ఎఫైర్, శృంగార సంబంధం గురించి తెలిసిన తల్లి, తన కూతురిని హతమార్చేందుకు ఓ కిరాయి హంతకుడిని నియమించుకుంది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సదరు హంతకుడికి సుపారీ ఇచ్చిన 42 ఏళ్ల మహిళనే అతను హతమార్చాడు.
Air India Express Flight: తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్యని ఎదుర్కొంది. తాజాగా విమానం తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే మండలం మకరవిళక్కు సీజన్ కోసం శబరిమల ఆలయ దర్శన సమయాలను రీషెడ్యూల్ చేసింది.
Breaking News: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్య ఎదురైంది. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి పైలెట్ అనుమతి కోరాడు.
Sayaji Shinde: ప్రముఖ నటుడు సాయాజీ షిండే రాజకీయ పార్టీలో చేరారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అజిత్ పవార్‌కి చెందిన ఎన్సీపీ పార్టీలో శుక్రవారం చేరారు. అజిత్ పవార్ స్వయంగా సాయాజీ షిండేని పార్టీలోకి స్వాగతించారు.