Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ద్వేషిగా, హిందూ ద్వేషిగా విమర్శలు ఎదుర్కొనే స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్కి గురవుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఫహద్‌ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలేకి గొడుకు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ(ఎంపీఏ) ర్యాలీలో ప్రసంగిస్తున్న సుప్రియా సూలేకి ఫహద్ గొడుగు […]
PM Modi Russia visit: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హజరయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 22-23 తేదీల్లో కాజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలో పర్యటించనున్నారు. కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీ బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో భేటీ కానున్నారు.
Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది.
Yahya Sinwar: ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత, ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ వార్త నిజమైతే హమాస్‌ని కూకటివేళ్లతో పెకిలించినట్లే.
Bangladesh: పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ పయణిస్తోంది. ఆ దేశ జాతీయ సెలువు దినాలను ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 7, ఆగస్టు 15 వేడుకలతో సహా 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 స్వాతంత్ర్య సంగ్రామం స్పూర్తిపై దాడిగా ఈ నిర్ణయాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.
Air India: వరస బాంబు బెదిరింపుల ఘటనలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరసగా నాలుగో రోజు కూడా బాంబు బెదిరింపు వచ్చాయి. ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి కొన్ని గంటల ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 గురువారం తెలిపింది. విమానం ‘‘స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది.
Israel-Iran Conflict: నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ముందే ఇరాన్‌పై ప్రతీకార దాడి చేయాలని ఇజ్రాయిల్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులను ఫైర్ చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడినంది. ఇజ్రాయిల్ లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంలోనే నస్రల్లాని బీరూట్‌లో వైమానికదాడి చేసి చంపేసింది. కీలకమైన హిజ్బుల్లా నాయకులను కూడా ఇజ్రాయిల్ ఎలిమినేట్…
Lawrence Bishnoi: కెనడా, ఇండియాల మధ్య దౌత్య ఉద్రిక్తలు పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్యూడో ఆరోపించాడు. దీనిని అసంబద్ధ వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో కెనడాలోని భారత రాయబారులకు సంబంధం ఉందని ముఖ్యంగా,
Somy Ali: మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య తర్వాత మరోసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతోంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే, సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిక్‌ని చంపడం ద్వారా సల్మాన్ ఖాన్‌కి సందేశం పంపింది. ఈ విషయాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో అప్పటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ నేతలతో సహా 45 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.