Air India: ముంబై-లండన్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు..
- ముంబై-లండన్ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..
- ల్యాండింగ్‌కి అరగంట ముందు ‘‘స్క్వాకింగ్ 7700’’ ఎమర్జెన్సీ కోడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: వరస బాంబు బెదిరింపుల ఘటనలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరసగా నాలుగో రోజు కూడా బాంబు బెదిరింపు వచ్చాయి. ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి కొన్ని గంటల ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 గురువారం తెలిపింది. విమానం ‘‘స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది.
Read Also: Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?
Also Read
ముంబై నుంచి ఎయిర్ ఇండియా విబమానం ఈ రోజు ఉదయం 7.05 గంటలకు టేకాఫ్ అయింది. తూర్పు ఇంగ్లండ్ మీద ప్రయాణించే సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్ హీత్రూ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.05 గంటలకు దిగాల్సి ఉంది. ‘స్క్వాకింగ్ 7700’ విమాన పరిస్థితిని సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి తెలియజేస్తుంది. నాలుగు రోజుల్లో కనీసం 20 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు 5 ఎయిర్ ఇండియా, రెండు విస్తారా, రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఈ బాంబు బెదిరింపుల అంశంపై నిన్న పార్లమెంటరరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డీజీసీఏ అధికారులతో ఆ శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సమావేశమయ్యారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణీకులు భద్రతే తమ ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఈ ఘటనలపై సమగ్ర నివేదిక పంపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను హోం మంత్రిత్వ శాఖ కోరింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!