Karnataka High Court: వివాహ ధృవీకరణ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ‘‘వక్ఫ్ బోర్డు’’లకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై తాజాగా కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డులు మ్యారేజ్ సర్టిఫికేట్లు జారీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Bomb threats: దేశంలో వరసగా విమానాలు బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. బుధవారం కూడా మరో రెండు విమానాలకు ఇలాంటి వార్నింగ్స్ వచ్చాయి. బెంగళూర్ నుంచి బయలుదేరే ఆకాసా ఎయిర్ విమానానికి, ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానానికి బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల్లో ఇలా 12 విమానాలకు నకిలీ బెదిరింపులు రావడం సంచలనంగా మారాయి.
MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది.
India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యయుద్ధం తీవ్రమైంది. ఇరు దేశాలు కూడా తమతమ రాయబారుల్ని ఆయా దేశాల నుంచి విత్ డ్రా చేసుకున్నాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురుకి సంబంధాలు ఉన్నాయని కెనడా ఆరోపించడంతో ఉద్రిక్తత పెరిగింది.
Baba Siddique Murder: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ని ముంబైలోని బాంద్రాలో కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. తామే ఈ హత్యకు పాల్పడినట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఎంపికయ్యారు. అక్టోబర్ 17 అంటే రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హర్యానాకు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ కట్టడ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా నయాబ్ సింగ్ సైనీని తమ నేతగా ఎన్నుకున్నారు.
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.
Indigenous Bullet Trains: భారతదేశం తన తొలి స్వదేశీ ‘‘బుల్లెట్ ట్రైన్’’ తయారీకి సిద్ధమవుతోంది. మొదటి బుల్లెట్ ట్రైన్ బెంగళూర్‌లో తయారు చేయబడుతోందని అంతా అనుకుంటున్నారు. దీని వేగం గంటలకు 280 కి.మీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఆపరేషనల్ స్పీడ్ 250 వేగం ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉంటే, కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలకు అమెరికా వంత పాడుతోంది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా భారత్‌ని కోరింది. మంగళవారం వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూమిల్లర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణల్ని ‘‘తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా స్పష్టం చేసింది.
Jammu Kashmir: దాదాపుగా 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో 48 గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ మెజారిటీ మార్క్ 46ని దాటింది.