Human Sacrifice: ఛత్తీస్‌గఢ్ మూఢనమ్మకాలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పలువురు ‘నరబలి’ వంటి ఆచారాలకు బలయ్యారు. తాజాగా రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి తన నానమ్మని చంపేశాడు. ఇది నరబలి అని అధికారులు అనుమానిస్తున్నారు.
Scissors In Abdomen: సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత బయటపడింది. అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కత్తెరను మహిళ పొత్తికడుపులోనే వదిలేశారు. ఆమె గత దశాబ్ధకాలంగా నొప్పితో బాధపడుతూనే ఉంది.
India Canada: ఇండియా కెనడాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురికి ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. కెనడా ఆరోపణల్ని కొట్టిపారేసిన ఇండియా, కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకుంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది. ఈ తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రి వర్గం కేంద్రాన్ని కోరింది. తాజా తీర్మానం జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా గుర్తింపును పునురుద్ధరించే ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
Rahul Gandhi: ఒడియా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన కారణంగా బుద్దాదిత్యపై కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్యూఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ శుక్రవారం క్యాపిటల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుద్ధాదిత్య సోషల్ మీడియా పోస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Crime: ఆర్మీ జవాన్‌గా నటించిన ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. ఫేస్బుక్లో యువతితో స్నేహాన్ని పెంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కపిలేష్ శర్మ 2023లో ఫేస్బుక్లో ఆర్మీ జవాన్‌గా కలరింగ్ ఇచ్చి, మహిళతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్ పెట్టుకున్నారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల షేరింగ్‌పై బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ స్పీడ్ పెంచింది. సీట్ల షేరింగ్ విషయమైన గత రాత్రి కేంద్ర హోం మంత్రితో కూటమి నేతలు భేటీ అయ్యారు. చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో అమిత్ షాని కలిశారు.
Hoax Bomb Threats: వరసగా నకిలీ బాంబు బెదిరింపులు ఇండియా విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. భారత విమానయాన రంగాన్ని నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఈ నకలీ బెదిరింపుల వల్ల ఏయిర్‌లైన్ సంస్థలు కోట్లలో నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండర్, జర్మనీ నుంచి వచ్చాయని తెలుస్తోంది. కావాలనే భారత విమానాలను టార్గెట్ చేస్తు్న్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Kash Patel: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రాట్ల పక్షాన కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌కి అత్యున్నత బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.
Bahraich violence: దుర్గా నిమజ్జనం వేళ ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా అనే యువకుడిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు.