Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ద్వేషిగా, హిందూ ద్వేషిగా విమర్శలు ఎదుర్కొనే స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఫహద్‌ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎన్సీపీ-ఎస్‌పీ ఎంపీ సుప్రియా సూలేకి గొడుకు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ(ఎంపీఏ) ర్యాలీలో ప్రసంగిస్తున్న సుప్రియా సూలేకి ఫహద్ గొడుగు పట్టాడు.
ఫహద్ ముంబై నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాడు. అయితే, ఫహద్ సొంత ప్రయోజనాలకు ఇలా చేస్తున్నాడని ఆరోపిస్తూ నెటిజన్లు ఈ వైరల్ ఫోటోని ట్రోల్ చేస్తున్నారు. రానున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ముంబైలోని చెంబూరులోని అనుశక్తినగర్ స్థానం నుంచి పోటీ చేయాలని ఇతను ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే, ఈ స్థానానికి ఎన్సీపీ-ఎస్‌పీ నేత నవాబ్ మాలిక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
నెటిజన్లు ఫహద్‌తో పాటు అతని భార్య స్వరా భాస్కర్‌ని కూడా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఫహద్ అహ్మద్, రోహిత్ పవార్‌తో పాటు ఎన్సీపీ నాయకుల సమావేశాలకు హాజరుకావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మహావికాస్ అఘాడీలో మిత్ర పక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి సీట్ల పంపకాల్లో ఒక్క సీటు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేదట్లు తెలుస్తోంది. మరోవైపు 12 స్థానాల్లో పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ ఆసక్తి చూపిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ వైరల్ ఫోటోపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. స్వరా భాస్కర్ భర్తకు గొడుక పట్టే జాబ్ వచ్చిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇదే కాదు, చనిపోయిన హమాస్, హిజ్బుల్లా నాయకులకు సంతాపాలు తెలిపే పని అతడి భార్యకు ఇవ్వబడిందని మరొకరు కామెంట్ పోస్ట్ చేశారు. ఎన్సీపీ కోటాలో టికెట్ దక్కించుకుని, సమాజ్ వాదీ పార్టీ కోసం పోరాడుతారని మరొకరు సెటైరికట్‌గా ట్వీట్ చేశారు. ముందు నుంచి చెప్పుకూడా మోస్తాడు అని మరొకరు ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుగబోతోంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు కూటములు పోటీ పడుతున్నాయి. మహాయుతి(బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)), మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)) మధ్య పోటీ నెలకొంది.
This is nothing. His wife is given the job of writing obituaries of slain Hamas and Hezbollah leaders
— Brutal Truth (@sarkarstix) October 17, 2024
आगे से चप्पल भी उथाएगा
— SGupta_Delhi 🇹🇯 Bharat (@SG_Dr_India) October 18, 2024
Swara Bhasker's husband given job of holding umbrella for Supriya Sule 🥲 pic.twitter.com/oUxbcvyfLH
— Ankur Singh (@iAnkurSingh) October 17, 2024