Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లోకి ఉత్తర కొరియా సైనికులు ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా తరుపున పోరాడటానికి కిమ్ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తమపై పోరాటంలో 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించడానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం చెప్పారు. ఉత్తర కొరియా రష్యాకి తన సైనికులను పంపిందని జెలన్ స్కీ గతంలో కూడా ఆరోపించారు. అయితే, మొదటిసారి ఎంత మంది సైనికులను పంపించారనే విషయంపై వివరాలు వెల్లడించారు.
Gujarat: ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లో
Starlink satellites: స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారీ ప్రణాళికకు సిద్ధమయ్యాడు. తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని మరింత పెంచేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. తన సెకండ్ జనరేషన్ స్టార్‌లింక్ వ్యవస్థ కోసం 29,988 శాటిలైట్లను భూమి చుట్టూ మోహరించాలని అనుకుంటున్నాడు. తన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ని విస్తరించడానికి ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్(ఎఫ్‌సీసీ)కి ప్రతిపాదనలు దాఖలు చేశాడు.
Siddaramaiah: హిందుత్వ సిద్ధాంతకర్తలు వినాయక్ దామోదర్ సావర్కర్, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వాల్కర్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. గురువారం బెంగళూర్‌లోని కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ(కేపీసీసీ) కార్యాయలంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.
Yahya Sinwar: ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ హమాస్ లీడర్, ఉగ్రసంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సిన్వార్ గురించి గత దశాబ్ధ కాలం నుంచి ఇజ్రాయిల్ వెతుకుతోంది. అత్యంత రహస్యంగా గాజాలోని భూగర్భ టన్నెల్స్‌లో తన భార్య, పిల్లలతో నివాసం ఉండే సిన్వార్ చివరకు పిల్ల సైనికులు అంటే.. కేవలం ఇజ్రాయిల్ ఆర్మీలో 9 నెలల క్రితమే చేరిన 20 ఏళ్ల లోపు యువకుల చేతిలో హతమయ్యాడు.
Maharashtra Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 20న ఒకే విడతలో రాష్ట్రంలోని 288 స్థానాలకు పోలింగ్ నిర్వహించి, 23న ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పింది. మహారాష్ట్రలో అధికార ‘మహాయుతి’, విపక్ష ‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’ మధ్య పోరు రసవత్తరంగా మారింది. హర్యానా ఎన్నికల విజయంతో బీజేపీ కూటమి ‘మహాయుతి’ మంచి జోరుపై ఉంది. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్) ఎంవీఏ కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
Benjamin Netanyahu: ‘‘ఆడు మగడ్రా బుజ్జీ’’ తెలుగు సినిమాలోని ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు ఆ డైలాగ్ ఫర్ఫెక్ట్గా సూటయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అని చెప్పవచ్చు.
Tamil Nadu: తమిళనాడులో మరోసారి ‘‘హిందీ’’ వివాదం రాజుకుంది. హిందీయేరత రాష్ట్రాల్లో హిందీ భాషా ఆధారిత కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనను పునరాలోచించుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోడీకి లేఖ రాశారు. అక్టోబర్ 18, 2024న హిందీ మాస వేడుకల ముగింపు సందర్భంగా చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ లేఖ రాశారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుగు తెగపడ్డారు. అమాయకుడైన నాన్ లోకల్ కార్మికుడిని హతమర్చారు. శుక్రవారం ఉదయం బీహార్‌కి చెందిన వలస కార్మికుడు రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. దక్షిణ కాశ్మీర్‌లోని షోషియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేరుకుని, హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.
India-Canada Issue: భారత్, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదంగా మారింది. గతేడాది నిజ్జర్ని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్లో ఆరోపించడంతో వివాదం చెలరేగింది.