Shocking: ఆగ్రాలో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారి అయిన భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌజ్‌లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తన భర్త దీనదయాళ్ దీప్తో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని మహిళ సూసైడ్ నోట్లో పేర్కొంది.
Bahraich violence: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో దుర్గాపూజ సమయంలో అల్లర్లకు కారణమై, గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులపై ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు నిందితులు నేపాల్ పారిపోతున్న క్రమంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు సర్ఫరాజ్ అలియాస్ రింకు, ఫాహిమ్ నేపాల్‌కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హండా బసెహ్రీ కెనాల్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నిందితుల కాలిలో కాల్చినట్లు తెలిపారు.
Badruddin Ajmal: దేశవ్యాప్తంగా వక్ఫ్ (సవరణ) బిల్లు చర్చనీయాంశంగా మారిన వేళ అస్సాంకు చెందిన ఎంపీ బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం, దాని పరిసరాల్లోని ప్రాంతాలు వక్ఫ్ ఆస్తులే అని ఆయన కొత్త వివాదానికి తెరలేపారు.
Salman Khan: మహారాష్ట్రలోని పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో అతడిని హత్య చేసేందుకు రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు గురువారం దాఖలు చేసిన ఛార్జిషీట్ పేర్కొంది.
India- Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య చిచ్చుపెట్టింది. గతేడాది నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, ముఖ్యంగా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొందరు ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించింది.
Bangladesh: బంగ్లాదేశ్ పాకిస్తాన్లా తయారయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ని మించి మతఛాందసవాద రాజ్యంగా మారేలా బంగ్లాదేశ్ పరిస్థితులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, రేణుకాస్వామి భార్య సహానా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రేణుకాస్వామి చనిపోయే సమయానికి సహానా 5 నెలల గర్భవతి. ఈ రోజు ఉదయం చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రి సహానాకు ఉచితంగా వైద్య చికిత్స అందించింది.
Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, తనిఖీలు…
ఇదిలా ఉంటే, ఖలిస్తాన్‌కి గట్టి మద్దతుదారు, ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కెనడియన్ సిక్క్ ఎంపీ జగ్మీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఎగతాళి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా మొత్తం నవ్వుకుంది. భారత రాయబారులు, భారతదేశంపై ఆంక్షలు విధించాలని జగ్మీత్ సింగ్ డిమాండ్ చేశారు
VIP security: హైరిస్క్ జాబితాలో ఉన్న 9 మంది వీఐపీలకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కమాండోలను విత్ డ్రా చేసుకుని వారి స్థానంలో సీఆర్పీఎఫ్ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన తాజా బెటాలియన్‌ను కూడా మంజూరు చేసింది. ఇటీవల పార్లమెంట్ సెక్యూరిటీ విధుల నుంచి ఉపసంహరించుకోబడిన సీఆర్పీఎఫ్-వీఐపీ సెక్యూరిటీ వింగ్‌ని ప్రముఖుల భద్రత కోసం వినియోగించనున్నారు.