Somy Ali: మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య తర్వాత మరోసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతోంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే, సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిక్‌ని చంపడం ద్వారా సల్మాన్ ఖాన్‌కి సందేశం పంపింది. ఈ విషయాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
Read Also: Sheikh Hasina: షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ..
ఇదిలా ఉంటే, తాజాగా సబర్మతీ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ని సల్మాన్ ఖాన్ ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ సోమీ అలీ విచిత్రమైన కోరిక కోరింది. జూమ్ కాల్ కోసం ఆహ్వానం పంపింది. ‘‘నమస్తే, లారెన్స్ భాయ్,మీరు జైలు నుండి కూడా జూమ్ కాల్స్ చేస్తారని నేను విన్నాను. కాబట్టి నేను మీతో కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. దయచేసి జూమ్ కాల్ ఎలా చేయాలో చెప్పండి. రాజస్థాన్ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. నేను అక్కడి దేశాలయాల్లో పూజలు చేయాలనుకుంటున్నాను. దీని కన్నా ముందుగా చర్చించేందుకు జూన్ కాల్ చేయాలి. ఇది మీ మంచికోసమే అని నమ్మండి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
సల్మాన్ ఖాన్, సోమీ అలీ 1990లో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గతంలో సోమీ అలీ సల్మాన్ ఖాన్ గృహ హింసకు పాల్పడినట్లు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్ని సల్మాన్ ఖాన్ ఖండించారు. అయితే, కృష్ణజింకలను వేటాడిని కేసులో సల్మాన్ ఖాన్‌ని బిష్ణోయ్ వర్గం టార్గెట్ చేసింది. లారెన్స్ బిష్ణోయ్ ఏకంగా సల్మాన్ ఖాన్‌ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. తన మెంబర్ల ద్వారా బాంద్రా హౌజ్, పన్వెల్ ఫామ్‌హౌజులో చంపేందుకు కుట్ర కూడా చేశారు. ఈ కుట్రకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ బెదిరింపులకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోధవా వంటి వారు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు.