Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ని అప్పగించాలని కోరాం..
- ఇంత వరకు కెనడా నుంచి స్పందన రాలేదన్న కేంద్రం..
- కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యల తర్వాత స్పందించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawrence Bishnoi: కెనడా, ఇండియాల మధ్య దౌత్య ఉద్రిక్తలు పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్యూడో ఆరోపించాడు. దీనిని అసంబద్ధ వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో కెనడాలోని భారత రాయబారులకు సంబంధం ఉందని ముఖ్యంగా, భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురి ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్ ఫైర్ అయింది. కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్ లోని కెనడా రాయబారుల్ని మీ దేశానికి వెళ్లాలని ఆదేశించింది.
ఇదే కాకుండా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వివరాలను ఈ రాయబారులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి పంపిస్తున్నారంటూ అక్కడి పోలీసులు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కెనడా పీఎం ట్రూడో కూడా నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపించాడు. అయితే, కెనడా ఆరోపణలపై భారత్ ప్రతీసారి సాక్ష్యాలు సమర్పించాలని కోరినా.. కెనడా ఈ పని చేయలేదు. తాజాగా ట్రూడో తమ వద్ద గట్టి సాక్ష్యాలు లేవని ఒప్పుకున్నాడు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
అయితే, గతంలో కెనడాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల్ని తమకు అప్పగించాలని కొన్నేళ్ల క్రితం భారత్ కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న సిండికేట్ సభ్యుల్ని తమకు అప్పటించాలని భారత్ కెనడాని కోరిందని.. కెనడా ఇంకా స్పందించలేదని అన్నారు. గుర్జిత్ సింగ్, గుర్జీందర్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ గిల్, లఖ్‌బీర్ సింగ్ లాండా, గుర్‌ప్రీత్ సింగ్ పేర్లను విదేశాంగమంత్రిత్వ శాఖ కెనడాకు ఇచ్చిందని, వీరిలో బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉన్నారని చెప్పింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను పంచుకోలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక, వేర్పాటువాద అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు కెనడా తన ‘‘వాక్ స్వాతంత్ర్యాన్ని’’ ముందకు తీసుకువస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లారెన్స్ బిష్ణోయ్ పేరుని వెల్లడించిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!