Crime: బెంగళూర్‌తో దారుణం జరిగింది. ప్రియురాలని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశారు. ఇద్దరూ కూడా శనివారం నగరంలోని సర్వీస్ అపార్ట్మెంట్ లాబీలోకి ప్రవేశించేటప్పుడు నవ్వుతూ కనిపించారు.
Mallikarjun Kharge: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం మాట్లాడుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ని ఉపయోగించాలని సూచించారు.
Karnataka: కర్ణాటక విశ్వ వొక్కలిగ మహాసంస్తాన మఠం స్వామీజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని ఆయన పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు అలహాబాద్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది.
Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
Supreme Court: ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలాలే ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వివాదానికి కేంద్రంగా మారారు. పార్లమెంట్లో ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరిచారని బీజేపీ మండిపడుతోంది. మంగళవారం జాతీయ గీతాలాపన సమయంలో కూడా కాంగ్రెస్ నేత సరిగా ప్రవర్తించలేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 16 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు. 166 మంది అమాయకమైన ప్రజలు కాగా, 9 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఒకే ఒక్క టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇత
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నగరంలో అట్టుడుకుతోంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై అక్కడి స్థానికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరపాల్సి వచ్చింది.
Rajyasabha Elections: రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20న ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఏపీలోని 3 స్థానాలు ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యల రాజీనామా ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.