Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు.
China: పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), చైనా మిలిటరీలో అవినీతి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పలువురు ముఖ్య మిలిటరీ అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. జిన్ పింగ్ అధికారంలో పలువురు ఉన్నతాధికారుల జాడ ఇప్పటికీ తెలియదు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్‌లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు.
Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్‌లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
BJP: హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తిరస్కరించి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే, కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ ఓడిపోతే ఈవీఎంల గురించి ఏడుస్తారు.
Ajmer Sharif Dargah: దేశంలో పలు మసీదులపై ప్రస్తుతం కేసుల నడుస్తున్నాయి. కాశీలో జ్ఞానవాపి మసీదు, మథురలో శ్రీకృష్ణ జన్మభూమి, తాజాగా యూపీ సంభాల్ నగరంని జామా మసీదులు వివాదానికి కేరాఫ్‌గా మారాయి. గత ఆదివారం మసీదు సర్వేకు వచ్చిన అధికారులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది.
Supreme Court:ఏకాభిప్రాయంతో ‘‘రిలేషన్షిప్’’ నడిపి, అది కాస్త చెడిపోయిన తర్వాత అత్యాచార కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరువురు వివాహ సంబంధం లేకుండా, ఇష్టపూర్వకంగా సుదీర్ఘమైన శారీరక సంబంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాల్లో వివాదాలు చెలరేగి జంట విడిపోతున్నారు. ఇలాంటి సమయంలో సదరు వ్యక్తిపై మహిళలు అత్యాచారం కేసులు పెడుతున్నారు. Read Also: INDIA Bloc: మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం! తాజాగా, […]
Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయిన శివసైనికులు మద్దతు ఇస్తారని, తాను బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీ నుంచే ఉంటారని తెలుస్తోంది.
Mahindra BE 6e And XEV 9e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా తన బ్యాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. మహీంద్రా బ్రాండ్-న్యూ INGLO EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన BE 6e, XEV 9e ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ అయ్యాయి.