Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.
Prasannajit Rangari: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
Eknath Shinde: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి ఎవరిని సీఎంగా ఎన్నుకన్నా శివసైనికులు వారికి మద్దతు ఇస్తారని షిండే స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ‘‘నా వల్ల మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా సమస్య ఎదురైతే […]
Maharashtra: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెలువడిని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలు గెలుచుకుని మరోసారి మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, ఫలితాలు వచ్చి నాలుగు రోజలు అవుతున్నా.. సీఎం ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు
Peanut Allergy: అమెరికాకు చెందిన 23 ఏళ్ల యువతి అనూహ్యంగా మరణించింది. అలిసన్ పికరింగ్ అనే యువతి ‘‘పీనట్ ఎలర్జీ’’కి గురై చనిపోయింది. రెస్టారెంట్లో అనుకోకుండా వేరుశెనగ తినడంతో ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురై మరణించింది. తెలిసిన రెస్టారెంట్లో డేటింగ్‌కి వెళ్లిన సమయంలో ఆమె ఈ అలర్జీకి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్ నగరం తీవ్రమైన హింసతో అట్టుడికింది. స్థానిక షాహీ జామా మసీదు సర్వేకు వెళ్లిన వారిపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది.
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలిచింది. అయితే, విజయం సాధించిన నాలుగు రోజులైనప్పటికీ, మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఏక్నాథ్ షిండే ఉన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మతనాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఆయన అరెస్ట్‌పై, బెయిల్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై పోలీసుల దాడిని ఖండించింది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్‌కి చేరుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించాడు. ఇదిలా ఉంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ నేత, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశంలో హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న బ్రహ్మచారిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాజధాని ఢాకాలో ఇతడిని అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులు ఆయనకు బెయిల్‌ని కూడా ఇవ్వకుండా,