Rahul Gandhi: కాంగ్రెస్ నేత, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వివాదానికి కేంద్రంగా మారారు. పార్లమెంట్‌లో ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరిచారని బీజేపీ మండిపడుతోంది. మంగళవారం జాతీయ గీతాలాపన సమయంలో కూడా కాంగ్రెస్ నేత సరిగా ప్రవర్తించలేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత అమిత్ మాల్వియా రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు వీడియోలను షేర్ చేశారు. రాహుల్ గాంధీ జాతీయ గీతం సమయంలో పక్కచూపులు చూస్తున్నట్లు విమర్శించారు.
Read Also: Health Benefits: ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
మరో వీడియోలో రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగా, రాహుల్ గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించినట్లు చూపిస్తోంది. రాష్ట్రపతిని పలకరించకుండా గాంధీ వేదికపై నుంచి వెళ్లిపోవడం వీడియోలో ఉంది. ‘‘రాహుల్ గాంధీ 50 సెకన్లు కూడా ఓపిక పట్టుకోలేరు. ఇలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడిపై అసహ్యకరమైన వ్యాక్యలు చేస్తారు’’ అని దుయ్యబట్టారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జోబైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారని ఆరోపించారు.
జాతీయ గీతం ముగియగానే వేదిక నుంచి దిగిపోయేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అదే సమయంలో ఇతర నేతలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని పలకరించడం వీడియో చూడొచ్చు. ‘‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరుస్తున్నారు. ఎందుకంటే ఆమె భూమిపై అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్ గాంధీ కుటుంబం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీను పట్టించుకోలేడం లేదని ఇది చూపిస్తుంది’’ అని మాల్వియా ఆరోపించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదు.