Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సేవ చేస్తున్న బాదల్‌పై అగంతకుడు దాడికి యత్నించాడు. తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది అతడిని అడ్డుకున్నారు. దీంతో బాదల్ సురక్షితంగా బయటపడ్డారు. వీల్ చైర్‌లో ఉన్న మిస్టర్ బాదల్ గోల్డెన్ టెంపుల్ గేట్ వద్ద ‘సేవాదర్’ స్థలంలో ఉన్న సమయంలో ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగింది.
నిందితుడని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ముందుగా గేటు వద్దకు వచ్చి జేబులోని తుపాకీ తీయడం అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డైంది. నరేన్ సింగ్ చౌరా అమృత్ సర్‌కి 60 కిమీ దూరంలోని గురుదాస్‌పూర్ జిల్లా చౌరా అనే గ్రామ నివాసి. ఇతనికి నిషేధిత సిక్కు ఉగ్రవాద సంస్థ ‘‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’’తో సంబంధం ఉన్నట్లు భద్రతా ఏజెన్సీలు తెలిపాయి.
Read Also: AlluArjun : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MMకు అల్లు అర్జున్
68 ఏళ్ల చౌరా చండీగఢ్‌లోని బురైల్ బైల్ నుంచి తప్పించుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2004లో జైలు నుంచి సొరంగం తవ్వి నలుగురు ఖైదీలు తప్పించుకుపోయారు. ఈ నలుగురు ఖైదీల్లో బబ్బర్ ఖల్సా చీఫ్ జగ్తార్ సింగ్ హవారా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకులు పరమ్‌జిత్ సింగ్ భియోరా , జగ్తార్ సింగ్ తారా, హత్యా దోషి దేవి సింగ్ ఉన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చౌరాను 2013లో అరెస్టు చేశారు. ఐదేళ్ల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఇటీవల సిక్కు మత సంస్థ అకాలీ తఖ్త్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కి మతపరమైన శిక్ష విధించింది. 2015లో డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కి క్షమాభిక్ష పెట్టినందుకు సిక్కు సంస్థ విచారణ జరిపింది. దోషిగా తేలినందుకు స్వర్ణదేవాలయంలో టాయ్‌లెట్స్, వంటగది శుభ్రం చేయాలని శిక్షను విధించింది. ఈ శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది.