Mahindra BE 6E: స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E కార్లను రిలీజ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టన్నింగ్స్ లుక్స్‌తో వినియోగదారులను వెంటనే ఆకర్షించేలా మహీంద్రా ఈ కార్లను డిజైన్ చేసింది. ఇదంతా బాగానే ఉన్నా, ప్రస్తుతం మహీంద్రా BE 6Eపై భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
BE 6E కారులో ‘‘6E’’ని ఉపయోగించడంపై ఇండిగో ఈ కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని వాడటంపై ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వర్సెస్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ పేరుతో ఈ కేసును మంగళవారం జస్టిస్ అమిత్ బన్సాల్ ముందుకు వచ్చింది. అయితే, ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 09న జరగనుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మహీంద్రా, ఇండిగోతో చర్చలు ప్రారంభించినట్లు ఇండిగో తరుపున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు తెలియజేశారు.
Read Also: Mahindra XEV 7e: లాంచ్‌కు ముందు ఫోటో లీక్.. డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
వివాదం ఇదే:
ఇండిగో తన బ్రాండ్ గుర్తింపుకు ‘‘6E’’ పేరుతో సేవల్ని, వసతులని బ్రాండింగ్ చేస్తోంది. ఈ కాల్ సైన్ కింద 6E ప్రైమ్, 6E ఫ్లెక్స్, 6E యాడ్-ఆన్‌లతో సహా అనేక ప్రయాణీకుల-కేంద్రీకృత సేవలను ఎయిర్‌లైన్ అందిస్తుంది. ఇండిగో ‘‘’6E లింక్’’ అనే ట్రేడ్ మార్క్‌ని 2015లో రిజిస్టర్ చేయించింది. అయితే, మహీంద్రా ఎలక్ట్రిక్ ‘BE 6E’ కింద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రార్ నుంచి ఆమోదం పొందింది. మహీంద్రా ఎలక్ట్రిక్ 12 క్లాస్ కింద ‘BE 6E’ని రిజిస్టర్ చేయించింది. ప్రస్తుతం ఇది మొత్తం వివాదానికి కారణమైంది.