Devendra Fadnavis: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కన్ఫామ్ అయింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక తర్వాత మాట్లాడుతూ.. ‘‘మీరందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శాసనసభా పక్షంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా కేంద్ర పరిశీలకులు విజయ్ రూపానీ, నిర్మలా సీతారామన్‌లకు కూడా ధన్యవాదాలు. ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. ఈ ఎన్నికలు ‘ఏక్ హై తో సేఫ్ హై’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ అని నిరూపించాయి. హర్యానాతో మా విజయాల పరంపరను పునఃప్రారంభించాము. ఇప్పుడు మహారాష్ట్ర ఓటర్లకు నమస్కరిస్తున్నాను, మా ఇతర మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Rajanna Sircilla: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి.. సిరిసిల్లలో ఆశా వర్కర్ల ఆందోళన..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు గానూ 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 46 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ చేసిన ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’( కలిసి ఉంటేనే రక్షణ) అనే నినాదం వైరల్‌గా మారింది. యూపీ సీఎం ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే నాశనం అవుతాం) అనే నినాదాలు చర్చనీయాంశంగా మారాయి.
Maharashtra: After being unanimously elected as the Leader of Maharashtra BJP Legislative Party, Devendra Fadnavis says "I thank everyone from the legislative party that you all chose me unanimously. I thank our central observers Vijay Rupani and Nirmala Sitharaman also. As you… pic.twitter.com/ylJJOrMS2q
— ANI (@ANI) December 4, 2024