Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. రేపు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Read Also: Lagacharla Case: లగచర్ల కేసులో ఏ2 నిందితుడు సురేశ్ను ప్రశ్నిస్తున్న పోలీసులు..
ఇదిలా ఉంటే, దేవేంద్ర ఫడ్నవీస్ పేరిట ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ జారీ చేసిన ఈ ఆహ్వానంంలో ఫడ్నవీస్ పేరు ‘‘ దేవేంద్ర సరితా గంగధరరావు ఫడ్నవీస్’’ అని ఉంది. ఫడ్నవీస్ తల్లి పేరు సరిత కాగా, తండ్రి పేరు గంగాధర్. మహారాష్ట్ర ప్రజలు సాధారణంగా తండ్రిపేరున తమ మిడిల్ నేమ్‌గా ఉపయోగించడం ఆనవాయితీ. అయితే ఫడ్నవీస్ తన తల్లి పేరును ఉపయోగించడం ఇదే మొదటిసారి.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో బీజేపీ నాయకుడు ‘దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్’ని తన పేరుగా ఉపయోగించారు. 2014 మరియు 2019 ప్రమాణ స్వీకారోత్సవాల సమయంలో తన తల్లిపేరుని తీసుకురాలేదు. ఫడ్నవీస్ టీన్ ఏజ్‌లో ఉ్న సమయంలోనే ఆయన తండ్రి గంగాధర్ రావు క్యాన్సర్‌తో మరణించారు. ఈయన జన్ సంఘ్, బీజేపీ నాయకుడు. ఫడ్నవీస్ సీఎం కావాలని బీజేపీతో పాటు అంతా కోరుకున్నారని తల్లి సరితా ఫడ్నవీస్ అన్నారు. ఫడ్నవీస్ నరేంద్రమోడీకి అభిమాని అని చెప్పారు. ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ బ్యాంకర్, సామాజిక కార్యకర్త. వీరికి దివిజ అనే కూతురు ఉంది.