Bangladesh: హిందువులపై ఆగని దాడులు.. మైనారిటీ హక్కుల సంఘం ఆందోళన..
- బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు..
- ఆందోళన వ్యక్తం చేసిన మైనారిటీ కౌన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఎన్నికైన తర్వాత నుంచి ఆ దేశంలో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులపై టార్గెటెడ్ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల తూర్పు సునమ్‌గంజ్ జిల్లాలోని హిందువులపై దాడి జరిగింది. ఈ దాడిని ఆ దేశంలోని అతిపెద్ద మైనారిటీ గ్రూప్ ‘‘ బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్’’ ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై వేగం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
Read Also: Devendra Fadnavis: కాంగ్రెస్ ‘ఈవీఎం’ ఆరోపణలు.. ‘లాతూర్’ ఉదాహరణ చెప్పిన సీఎం ఫడ్నవీస్
Also Read
డిసెంబర్ 03 రాత్రి మంగ్లార్‌గావ్, మోనిగావ్ ఈస్ట్ గునిగ్రామ్‌లలో హిందూ సమాజానికి చెందిన వారిపై గుంపు దాడికి పాల్పడింది. 100 కన్నా ఎక్కువ ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేశారు. షాపుల్ని లూటీ చేశారు. ఒక ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 1.5 మిలియన్ టాకా( రూ. 10లక్షల)కు పైగా నష్టం వాటిల్లినట్లు కౌన్సిల్ వెల్లడించింది. చాలా మంది మైనారిటీలు గ్రామం వదిలి పారిపోయారు. ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా 20 ఏళ్ల హిందూ వ్యక్తి ఆకాష్ దాస్ దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో దాడులు జరిగాయి. ఈ దాడులకు ముందే దాస్‌ని అరెస్ట్ చేశారు.
ఇటీవల, బంగ్లాదేశ్ హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి అధికారులు దేశద్రోహం ఆరోపణలతో అరెస్ట్ చేశారు. పలువురు మైనారిటీ నాయకుల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇదిలా ఉంటే, ఇస్కాన్‌కు చెందిన మరికొందరు హిందూ సన్యాసులను కూడా అక్కడి అధికారులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లోని 50 జిల్లాల్లో హిందువులపై 200 దాడులు జరిగాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!