Deep State: భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ‘‘యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్’’ పనిచేస్తుందని బీజేపీ ఆరోపించింది. అమెరికా ‘డీప్ స్టేట్’ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యం చేసుకుంటుందని పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉందని అన్నారు.
నిరాధారమైన ఆరోపణలు, దురుద్దేశపూరితమైన నివేదికలతో భారత దేశ వృద్ధిని దెబ్బతీసేందుకు అమెరికా డీప్ స్టేట్ పనిచేస్తోందని, ఇది కొంతమంది జర్నలిస్టులతో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కుమ్మక్కయ్యాయని సంబిత్ పాత్ర ఆరోపించడం సంచలనంగా మారింది. ఇదంతా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చేస్తుందని ఆయన మీడియాతో చెప్పారు. చాలా సందర్భాల్లో దేశంలో జరుగుతున్న పలు ఉద్యమాలకు, సమస్యలకు వెనక డీప్‌స్టేట్ ఉందని బీజేపీ వాదిస్తూ వస్తోంది. అయితే, ఇలా తొలిసారి మీడియాతో చెప్పడం సంచలనంగా మారింది.
Read Also: Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!
ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ లేదా OCCRP నివేదికలను ఉపయోగించి అదానీ గ్రూప్‌ని, దానితో ప్రధాని మోడీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం, దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని నిందించడాన్ని గురించి ఆయన మాట్లాడారు. OCCRPకి US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, జార్జ్ సోరోస్ వంటి డీప్‌స్టేట్, రెజిమ్ చేంజ్ చేసే వ్యక్తులతో సంబంధం ఉందని చూపించిన ఫ్రెంచ్ మీడియా నివేదికను సంబిత్ పాత్ర ఉదహరించారు. ప్రధాని మోడీ లక్ష్యంగా డీప్ స్టేట్ స్పష్టమైన లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం ఈ ఎజెండా వెనక యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉందని, దీనిని అమలు చేయడానికి మీడియా ఓ సాధనంగా పనిచేసిందని చెప్పారు.
OCCRPకి సంబంధించి 50 శాతం నిధులు నేరుగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి వస్తాయని ఫ్రెంచ్ పరిశోధనాత్మక మీడియా గ్రూప్ వెల్లడించింది. రాహుల్ గాంధీని అత్యున్నత స్థాయి ద్రోహి అని అన్నారు. అమెరికాకు చెందిన కొన్ని ఏజెన్సీలు, బిలియనీర్ జార్జ్ సోరోస్ కలిసి భారత ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఓ ట్రయాంగిల్‌గా మారిందని పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని, బీజేపీ మరో ఎంపీ నిషికాంత్ దూబే వెల్లడించారు. ప్రధాని మోడీపై ద్వేషంతో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులతో కలిసి కుట్ర పన్నిందని చెప్పారు. అమెరికా వెళ్లిన రాహుల్ గాంధీ ఇల్హాన్ ఒమర్ వంటి భారత వ్యతిరేక వ్యక్తుల్ని కలవడాన్ని లేవనెత్తారు.