Mahindra BE 6e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాన్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. మహీంద్రా BE 6E, XEC 9E కార్లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు BE 6E పేరు వివాదాస్పదంగా మారింది. కారు పేరులో ‘6E’ని వాడినందుకు, దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో కేసు పెట్టింది. దీనిని కారు పేరులో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే, శనివారం మహీంద్రా.. మహీంద్రా BE 6e’ని ‘మహీంద్రా BE 6’గా రీబ్రాండ్ చేసినట్లు వెల్లడించింది. మహీంద్రా మార్క్ “BE 6e” అనేది కేవలం ఇండిపెండెంట్ ‘‘ 6e” కాదని, “BE 6e” బ్రాండ్ పేరుపై హక్కును కలిగి ఉన్నామని స్పష్టం చేసింది. బ్రాండ్ హక్కుల్ని కోర్టులో కంటెస్ట్ చేస్తామని చెప్పింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది.
మహీంద్రా “BE 6e” ని ఉపయోగించడం ద్వారా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఇండిగో పిటిషన్ దాఖలు చేసింది. ఇది తమ ఎయిర్‌లైన్స్ ‘‘6E”ని కలిగి ఉన్నట్లు చెప్పింది. అయితే, ఈ వివాదంపై మహీంద్రా తాజా ప్రకటనలో.. ‘‘వాస్తవానికి మనం ఒకరి వృద్ధి, విస్తరణలో చాంపియన్లుగా ఉన్నప్పుడు, భారతదేశంలోని రెండు మల్టీనేషనల్ కంపెనీలు అపసవ్యమైన, అనవసరమైన సంఘర్షణలో పాల్గొనడం అనాలోచితంగా ఉంది’’ అని పేర్కొంది. అందుకే మా పోడక్ట్‌ని BE 6″గా బ్రాండ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పింది.
Read Also: Pragya Nagra: ప్రయివేట్ వీడియో లీక్.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
‘‘ఇది ఇండిగో యొక్క ‘6E’ నుండి ప్రాథమికంగా భిన్నంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఇది గందరగోళానికి దారి తీసిన వివాదాన్ని తొలగిస్తుంది. ప్రత్యేకమైన స్టైలింగ్ దాని ప్రత్యేకత మరింత నొక్కి చెబుతుంది. మా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పూర్తిగా భిన్నమైన పరిశ్రమ రంగం, ఉత్పత్తి కోసం ఉద్దేశించబడింది. అందువల్ల ఎలాంటి వైరుధ్యాన్ని చూడకూడదు’’ అని మహీంద్రా పేర్కొంది.
గతంలో టాటా మోటార్స్ తమ టాటా ఇండిగో కార్ బ్రాండ్ ఇచ్చిన ఇండిగో మార్క్‌ని ఉపయోగించిన ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిందనే విషయాన్ని మహీంద్రా కంపెనీ హైలెట్ చేసింది. ఇంటర్ గ్లోబ్ సంస్థ తన వ్యాపారంలో ఇండిగోని ఉపయోగించడం కొనసాగిస్తోంది. దీనిని బట్టి చూస్తే తాము ఉపయోగించి ‘‘BE 6e’’పై ఇండిగో అభ్యంతరం వారి మునుపటి ప్రవర్తనకు భిన్నంగా ఉందని మహీంద్రా చెప్పింది.
తమ ప్రోడక్స్ ‘‘’BE 6’గా బ్రాండ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నాము. అయితే ఇండిగో యొక్క క్లెయిమ్ నిరాధారమైననవి. దీనిని సవాల్ చేయకుంటే ఆల్ఫా న్యూమరిక్ 2 అక్షరాలపై గుత్తాధిపత్యం చేయడంలో చెడ్డ ఉదాహరణగా నిలుస్తుంది. తమ మార్క్ విలక్షణమైంది, విభిన్నమైంది. ఇది పరిశ్రమలు, ఇతర రంగాల్లోని అన్ని కంపెనీలకు పరిమితుల్ని కలిగిస్తుంది. అందుకే తాము ‘‘BE 6e’’ బ్రాండ్‌పై తమ హక్కులను రిజర్వ్ చేయడం కోసం కోర్టులో గట్టిగా పోరాడుతాం’’ అని మహీంద్రా చెప్పింది.